జూనియర్ ది అదే మహా సైలెన్స్

Update: 2019-02-26 04:30 GMT
నిన్న సాయంత్రం జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ మరోసారి బాబాయ్ అబ్బాయిల సంగమానికి వేదికగా నిలిచింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లో నటించడం వల్ల కళ్యాణ్ రామ్ రెగ్యులర్ గా బాలకృష్ణతో టచ్ లోనే ఉన్నాడు కానీ  ఎటొచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ఫంక్షన్స్ లో తప్ప బాబాయ్ ని కలుసుకునే ఛాన్స్ దొరకడం లేదు. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ తర్వాత ఈ ఇద్దరూ కలుసుకోవడం ఇదే. అయితే ఎన్టీఆర్ రెండు భాగాలూ విడుదలైనా దాని గురించి ఆన్ లైన్ లో తారక్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు కాబట్టి ఈ 118 స్టేజి మీద ఏమైనా రెండు ముక్కలు చెబుతాడేమో అనుకున్నారు
అందరు.

కానీ జూనియర్ మాత్రం అసలు దాని ప్రస్తావనే లేకుండా స్పీచ్ కొనసాగించాడు. యుద్ధవీరులకు విజయబాపినీడు కోడి రామకృష్ణ కోసం ఓ నిమిషం మౌనం పాటించిన తర్వాత నేరుగా అన్నయ్య సినిమా టాపిక్ లోకి వెళ్ళిపోయాడు. ఇది బాలయ్య ఫ్యాన్స్ ని నిరాశ పరిచేదే. నిజానికి తారక్ బాలయ్య సినిమా గురించి ఏదైనా మాట్లాడతాడేమో అని ఆశించడం తప్పేమి కాదు. మహానాయకుడు వచ్చి నిన్నటితో కేవలం 4 రోజులే అయ్యింది. బాబాయ్ తో పాటు అన్నయ్య తన తండ్రి పాత్రలో నటించిన సినిమా. సో బాగుందనో స్పందన చూసాను సంతోషంగా ఉందనో రెండు ముక్కలు చెబితే సరిపోయేది.

అసలు ఆ సినిమా వచ్చిందో లేదో అనే తరహాలో జూనియర్ అసలు ప్రస్తావనే తీసుకురాకపోవడం షాక్ కలిగించేదే. నివేదా థామస్ షాలిని గురించి సైతం తారక్ చెప్పాడు కానీ మూడు రోజుల క్రితం వచ్చిన బాబాయ్ సినిమా గురించి మాత్రం మౌనమే సమాధానం అయ్యింది. స్టేజి మీద అంత సన్నిహితంగా కనిపిస్తున్న బాలయ్య తారక్ లు అది దిగాక మాత్రం ఏదో గ్యాప్ మైంటైన్ చేస్తున్నారన్న గాసిప్స్ కు బలం చేకూరుస్తున్నది ఇలాంటివే
Tags:    

Similar News