కెరీర్ ఆరంభంలోనే ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్టు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఒక్కసారి శిఖరాన్ని తాకి వచ్చాక.. మళ్లీ ఆ దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాడు. మిగతా హీరోలు తనను దాటేసి వెళ్లిపోతుంటే.. ఇతను వెనకబడిపోయాడు. ఎన్టీఆర్ కు ఎదురైన ఇంకో సమస్య ఏంటంటే.. కామన్ ఆడియన్స్ కు అంతగా చేరువ కాలేకపోవడం. నందమూరి కుటుంబానికి వారసత్వంగా వస్తున్న అభిమానుల అభిమానం చూరగొన్నాడు కానీ.. సామాన్య ప్రేక్షకుల్లోకి అనుకున్న స్థాయిలో చొచ్చుకుని వెళ్లలేకపోయాడు. ఈ విషయంలోనే మహేష్ బాబుకి - ఎన్టీఆర్ కు తేడా కనిపిస్తుంది. మహేష్ బాబు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన అభిమానుల్ని నిలబెట్టుకుంటూనే కామన్ ఆడియన్స్ అభిమానాన్ని బాగా చూరగొన్నాడు. అందుకే అతడి సినిమాలు హిట్టయితే చాలా పెద్ద రేంజికి వెళ్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువయ్యే సినిమాలు చేయడం ఇందుకు మరో కారణం.
ఐతే తనను మాస్ సినిమాలే నిలబెట్టాయి కాబట్టి ఎన్టీఆర్ ఆ తరహా సినిమాలే చేశాడు. అవి ఓ దశలో మొహం మొత్తాయి. ఫ్యామిలీస్ కి, యూత్ కి చేరువయ్యే సినిమాలు పెద్దగా చేయకపోవడం మైనస్ అయింది. దీంతో కామన్ ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడం ఆలస్యమైంది. ‘బృందావనం’ దగ్గర్నుంచి కొంచెం మార్పు చూపించినా.. పూర్తి ఆమోదం పొందడానికి మాత్రం టైం పడుతోంది. ఈ ఏడాది ‘టెంపర్’లో భిన్నమైన క్యారెక్టర్ చేసి ట్రెండుకి తగ్గట్లుగా ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్. అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడిక ‘నాన్నకు ప్రేమతో’ ఎన్టీఆర్ ఇమేజ్ కు కంప్లీట్ మేకోవర్ అని చెప్పాలి. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందన్నది పక్కనబెడితే.. కెరీర్ పరంగా తారక్ కు బాగా ఉపయోగపడుతుందనడంలో మాత్రం సందేహం లేదు. కొన్నేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే ఎన్టీఆర్ నుంచి ఈ తరహా సినిమా వస్తుందని.. అతడిలాంటి లుక్ లో కనిపిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ రకంగా తారక్ కు ఇదొక రిఫ్రెషింగ్ మూవీనే. సుకమార్ లాంటి క్లాస్ డైరెక్టర్ తో జత కట్టడం ద్వారా ఎన్టీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ యూత్ కు బాగా చేరువ చేయడానికి.. కామన్ ఆడియన్స్ లో యాక్సెప్టెన్స్ తేవడానికి బాగా ఉపయోగపడతుందనడంలో సందేహం లేదు.