గ్యారేజ్ లోనే 18 తీస్కున్న ఎన్టీఆర్

Update: 2016-06-23 03:57 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబుల పారితోషికం 20 కోట్లు దాటేసిందనేది ఓపెన్ సీక్రెట్. వీళ్లిద్దరూ తప్ప రెమ్యూనరేషన్ విషయంలో ఆ రేంజ్ కి ఇంకా ఎవరూ చేరలేదు కానీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడా మార్క్ కి దగ్గరైపోయాడని తెలుస్తోంది.

జనతా గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ అందుకున్న మొత్తం ఎంతో ఇప్పుడో లెక్క వినిపిస్తోంది. జూనియర్ కి 18 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న నిర్మాతలు.. మొదట కొంత మొత్తం ఇచ్చి మిగిలిన అమౌంట్ ని బిజినెస్ పూర్తయ్యాక ఇచ్చేలా మాట్లాడుకున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై ఉన్న అంచనాల కారణంగా.. ఇంకా ఆడియో ఫంక్షన్ కూడా జరక్కుండానే ఇప్పటికే అన్ని ఏరియాల బిజినెస్ లు పూర్తయిపోయాయి.

దీంతో ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ చెల్లించేశారని.. మొత్తం 18 కోట్ల మొత్తం ముట్టిందని తెలుస్తోంది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం.. నెక్ట్స్ ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ కూడా 20 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
Tags:    

Similar News