ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ నాన్నకు ప్రేమతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 80రోజుల పాటు సుదీర్ఘంగా విదేశాల్లో షూటింగ్ చేశారు. లండన్ లోని థేమ్స్ నది పరిసరాల్లో ఓ భారీ భవంతిలో కీలకసన్నివేశాల్ని తెరకెక్కించి హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఎట్టకేలకు ఈ షెడ్యూల్ ముగించి ఎన్టీఆర్ హైదరాబాద్ లో దిగాడు. ఆయనతో పాటే సుకుమార్ అండ్ టీమ్ దిగింది. నిన్నటి రాత్రి ఎన్టీఆర్ శ్రీమంతుడు ప్రివ్యూ ప్రసాద్ లాబ్స్ లో వీక్షించాడు. అయితే నాన్నకు ప్రేమతో బ్యాలెన్స్ షూట్ ఎప్పుడు? అన్నదానిక్కూడా యూనిట్ నుంచి సమాధానం వచ్చింది.
అక్టోబర్ లో కొత్త షెడ్యూల్ కి సంబంధించిన ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అండ్ టీమ్ స్పెయిన్ కి పయనమవుతారని సమాచారం. అక్కడ ఎగ్జోటిక్ లొకేషన్ లో బ్యాలెన్స్ షూట్ చేస్తారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ - సుకుమార్ అహోరాత్రులు శ్రమిస్తున్నారు. సుదీర్ఘ షెడ్యూళ్లతో అస్సలు గ్యాప్ అనేదే లేకపోయినా ఎన్టీఆర్ ఎంతో కసి చూపిస్తున్నారు. అయితే ఈ కఠోరశ్రమ వెనుక ఎంతో మీనింగ్ ఉందనే అంటున్నారు.
ఈసారి ఎట్టి పరిస్థితిలో ఎన్టీఆర్ ఓ ల్యాండ్ మార్క్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే అతడికి 50కోట్ల క్లబ్ అందని మావిగానే మిగిలింది. ఒక రేసుగుర్రంలా - ఒక శ్రీమంతుడిలా ఇండస్ర్టీ టాక్ అయ్యే సినిమాలో నటించాలని కోరిక. అలాగే సుకుమార్ కి 1నేనొక్కడినే ఫ్లాప్ షో నుంచి బైటపడే హిట్ కావాలి. అందుకే ఇంత కఠోరంగా శ్రమిస్తున్నారని అనుకుంటున్నారంతా. మంచిదే చరిత్ర తిరగరాసే ఔట్ పుట్ ఇస్తామంటే ప్రేక్షకదేవుళ్లు ఆల్వేస్ వెల్ కమ్ చెప్పేస్తారు. ఇదే రైట్ టైమ్.