జగపతిబాబు విలన్ గా ఇప్పుడు బిజీ. సినిమా ఇండస్ట్రీలో హీరోగా మంచి స్టేటస్ ను చూసిన ఒక నటుడు, విలన్ గా అదే ఇండస్ట్రీలో అంతకి మించి ఎదగడం బహుశా జగపతిబాబు విషయంలోనే జరిగి ఉంటుందేమో. ఇప్పుడు విలన్ గా ఆయన వివిధ భాషల్లో బిజీ.
విలన్ గా ఆయన ఎదురుగా ఉంటే ఆయనతో తలపడాలని టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా కోరుకుంటున్నారు.
ఒక సీనియర్ హీరోగా ఆయనను వాళ్లు గౌరవిస్తారు. స్టార్ విలన్ గా ఆయనను అభిమానిస్తారు. తాజా ఇంటర్వ్యూలో కొంతమంది స్టార్ హీరోల విషయంలో ఆయన తన అభిప్రాయం చెప్పారు.
"ప్రభాస్ బంగారం .. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం అస్సలు లేదు. ప్రపంచంలోని అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ప్రభాస్. మహేశ్ బాబుతో రెండు సినిమాలు చేశాను. ఎక్కువ ఇంటరాక్షన్ లేదుగానీ, చాలా సరదాగా ఉంటాడు.
మహేశ్ బాబు ఎవరినీ వదలడు .. అందరి మీద సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే తనో పెద్ద కోతి. ఇప్పుడు తగ్గించినట్టున్నాడు .. కొంచెం మెచ్యూర్ అయ్యాడు. విపరీతమైన అల్లరి చేస్తాడు. ఎప్పుడు చూసినా గోల గోల చేస్తూనే ఉంటాడు .. నవ్విస్తూనే ఉంటాడు.
అల్లు అర్జున్ తో ఇంతవరకూ సినిమా చేయలేదుగానీ, ఆయనని నేను ఎక్కువగా లైక్ చేస్తాను. లుక్ పరంగా .. టాలెంట్ పరంగా ఆయన తనని తాను మలచుకున్నాడు. ఆయన ఎవరికైనా నచ్చవలసిందే.
అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడ్డాడు. ఆయనని నేను ఒకసారి జిమ్ లో చూశాను. అప్పటికి ఆయన ఎవరనేది నాకు తెలియదు. ఆయన చేసే వర్కౌట్స్ చూసే .. చాలా హార్డ్ వర్కర్ అనుకున్నాను. అందువల్లనే నేను ఆయనను ఎక్కువగా లైక్ చేస్తుంటాను. పవన్ తో పెద్దగా పరిచయం లేదు గానీ, ఆయనంటే నాకు ఇష్టమే .. అలాగే చిరంజీవి గారు కూడా.
కృష్ణవంశీ .. నేను చాలా క్లోజ్ .. మా ఇద్దరికీ సంబంధించి ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకరోజు రాత్రి ఇద్దరం అనుకోకుండా రోడ్డుమీద కలుసుకున్నాము. ఇద్దరం కూడా అప్పుడు లో డౌన్ లోనే ఉన్నాము .. మందు కొట్టేసి ఉన్నాము. బోర్ కొడుతుంది ఏం చేద్దాం అనుకున్నాము.
అప్పుడు నేను రోడ్డుమీదే డాన్సులాడాను. పోలీసులు చూశారు గానీ .. ఏవీ అనకుండా వదిలేశారు. నేను ఎలా ఉండాలని అనుకుంటానో అలాగే ఉంటాను .. లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాను" అని చెప్పుకొచ్చారు.