టాలీవుడ్ లో కొన్ని సెంటిమెంట్స్ భలే విచిత్రంగా ఉంటాయి. ఆ కాంబినేషన్ లు, ఈ టైమింగ్ లు అంటూ తెగ రచ్చ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ ఒకటి బైటకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి 15 ఏళ్లు అయింది. ఇందులో ఒకే ఏడాది రెండేసి చొప్పున సినిమాలు విడుదల చేసింది ఓ పది సార్లు మాత్రమే. రెండింటితోనూ హిట్ కొట్టినది మాత్రం 2010లోనే.
2010 ప్రారంభంలోనే అదుర్స్ అంటూ వివి వినాయక్ తో సూపర్ హిట్ సాధించాడు యంగ్ టైగర్. ఇప్పటికీ ఆ మూవీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. టీవీల్లో వస్తే.. వదిలిపెట్టకుండా చూసే జనాలు బోలెడు మంది ఉన్నారు. అదే ఏడాది ద్వితీయార్ధంలో బృందావనంతో మరో హిట్ సాధించాడు ఎన్టీఆర్. ఇది మనోడి కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా. ఇలా ఎన్టీఆర్ రెండు సూపర్ హిట్స్ సాధించిన అదే ఏడాది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబులు.. డిజాస్టర్లను ఇచ్చారు. పవన్ చేసిన పులి - మహేష్ చేసిన ఖలేజాలు.. అప్పటివరకూ వాళ్ల కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాపులుగా నిలిచాయి.
ఇప్పుడు సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. నాన్నకు ప్రేమతో సక్సెస్ తో ఎన్టీఆర్ స్టార్ట్ చేస్తే.. పవన్ సర్దార్ - మహేష్ బ్రహ్మోత్సవంలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ లెక్కన.. ఎన్టీఆర్ ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్న జనతా గ్యారేజ్ బంపర్ హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. మరి ఈ సెంటిమెంట్ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో!!