బ‌స‌వ‌తార‌కానికి చెప్ప‌కుండా రామోజీకి చెప్పారా?

Update: 2019-01-11 05:07 GMT
తెలుగుదేశం పార్టీకి ఈనాడుకు మ‌ధ్య అంత అవినాభావ సంబంధం ఏమిటి?  ఈనాడు లాంటి అగ్ర‌శ్రేణి ప‌త్రిక.. ప్రొఫెష‌న‌ల్ గా ర‌న్ అవుతుంద‌న్న పేరున్నప్ప‌టికీ ప‌చ్చ ట్యాగ్ ఎందుకు?  టీడీపీ అంటే రామోజీకి అంత అభిమానం ఏందుకు?  ఈ ప్ర‌శ్న సామాన్య ప్ర‌జ‌ల్లోనే కాదు.. ఈనాడు సంస్థ‌లో ప‌ని చేసే చాలామంది మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌.

దీనికి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు ఎవ‌రికి వారు చెప్పే మాట‌లు ఎన్ని ఉన్నా.. అవేమీ సంతృప్తినిచ్చేలా ఉండ‌వు. అయితే.. తాజాగా విడుద‌లైన ఎన్టీఆర్ బ‌యోపిక్ అలాంటి ప్ర‌శ్న‌కు సూటిగా.. ఎలాంటి సుత్తి లేకుండా స‌మాధానం చెప్పేసింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎన్టీఆర్ బ‌యోపిక్ ను మ‌రెవ‌రైనా తీసినా.. అందులోని అంశాలకు నిజ‌మ‌న్న ట్యాగ్ త‌గిలించాలంటే ఒకింత ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. తన తండ్రి బ‌యోపిక్ ను తీసిన బాల‌కృష్ణ‌.. ప్ర‌తి చిన్న అంశాన్ని డిసైడ్ చేసే ముందు ఎంతో హోంవ‌ర్క్ చేసిన త‌ర్వాతే తుది నిర్ణ‌యం తీసుకుంటార‌న్న దాన్లో ఎవ‌రికి ఎలాంటి అనుమానాలు ఉండ‌వు.

ఆ లెక్క‌న చూసిన‌ప్పుడు.. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చూపించిన అంశాలు దాదాపుగా వాస్త‌వాలుగా చెప్పాల్సిందే. సినిమా స్టార్టింగ్ లో ఇందులోని పాత్ర‌ల‌న్నీ క‌ల్పితాల‌న్న డిస్ క్లేమ‌ర్ చూపించినా.. అదంతా సాంకేతిక అంశంగానే చూడాలి. సినిమాలోని మిగిలిన సంగ‌తుల‌న్ని ఒక ఎత్తు అయితే.. పార్టీ పెట్టే విష‌యంలో ఎన్టీఆర్ తో చాలామంది క‌ల‌వ‌టం.. వారి.. వారి అభిప్రాయాలు చెప్ప‌టం చూపిస్తారు. వారిలో ఈనాడు ప‌త్రికాధినేత రామోజీ కూడా ఉంటారు.

హైద‌రాబాద్‌ లో పార్టీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెల్ల‌డించ‌టానికి సిద్ధ‌మవుతున్న వేళ‌లోనూ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్న విష‌యం బ‌స‌వ‌తార‌కానికి తెలీద‌న్న విష‌యం సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.  రాజ‌కీయాల్లోకి వెళుతున్నారా?  లేదా?  అన్న విష‌యంపై భార్య సందేహంలో ఉండ‌గా.. రామోజీ నుంచి వ‌చ్చిన ఫోన్ కాల్ తో ఎన్టీఆర్ పార్టీ పెట్ట‌నున్న విష‌యం భార్య‌కు అర్థ‌మ‌య్యే సీన్ ఒక‌టి క‌నిపిస్తుంది. ఇదంతా చూసిన‌ప్పుడు త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ విష‌యాన్ని భార్య కంటే ముందే రామోజీకి ఎన్టీఆర్ చెప్పిన‌ట్లుగా ఉంటుంది. అంటే.. టీడీపీ పురుడు పోసుకోవ‌టానికి కీల‌క‌మైన ముఖ్యుల్లో రామోజీ ఒక‌ర‌న్న విష‌యాన్నిఎన్టీఆర్ బ‌యోపిక్ తేల్చేసింద‌ని చెప్పాలి. ఈ సినిమా త‌ర్వాత చాలామందికి చాలా సందేహాలు తొలిగిపోయిన‌ట్లే.


Full View

Tags:    

Similar News