‘ఎన్టీఆర్‌’ రథయాత్ర ప్రారంభం కాబోతుంది

Update: 2018-10-01 06:35 GMT
బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ షూటింగ్‌ చకచక జరుగుతుంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్‌ త్వరలో రథయాత్రకు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ పొలిటికల్‌ జర్నీలో చైతన్య రథ యాత్ర చాలా కీలకం అనే విషయం తెల్సిందే. అందుకే సినిమాలో ఆ సీన్స్‌ కోసం దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

చైతన్య రథ సారథి హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్‌ రామ్‌ నటించనున్నాడు. ఇప్పటికే కళ్యాణ్‌ రామ్‌ కు సంబంధించిన మేకప్‌ టెస్టు పూర్తి అవ్వడంతో పాటు కొన్ని సీన్స్‌ ను కూడా చిత్రీకరించినట్లుగా సమాచారం అందుతుంది. ఇక చైతన్య రథ యాత్రకు సంబంధించిన సీన్స్‌ను శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం - అన్నవరం - గుంటూరు జిల్లాల్లో చిత్రీకరించబోతున్నారు. ఈ సీన్స్‌ కోసం భారీ ఎత్తున జనాలను సమకూర్చేందుకు తెలుగు దేశం నాయకులు సిద్దం అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

రథ యాత్రకు సంబంధించిన సీన్స్‌ ను దాదాపుగా వారం రోజుల పాటు చిత్రీకరించనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. రథయాత్ర సీన్స్‌ను చిత్రీకరిస్తే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లవుతుందని, ఇక పాటలు మరియు కొన్ని ఇతర సన్నివేశాల చిత్రీకరణ బ్యాలన్స్‌ ఉంటుందని సమాచారం అందుతుంది. క్రిష్‌ ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
Tags:    

Similar News