తెలీకుండానే ఏడ్చేశాను!- ఎన్టీఆర్‌

Update: 2019-02-25 17:01 GMT
నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన ద‌గ్గ‌రి నుంచి క‌ల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ చాలా ఎమోష‌న‌ల్ అవుతున్నారు. ప్ర‌తి చిన్న విష‌యానికి వారి హృద‌యం బ‌రువెక్కిపోతోంది. సెంటిమెంట్ క‌ట్ట‌లు తెంచుకుంటోంది. ఏది మాట్లాడినా దాంట్లో సెంటిమెంట్ క‌నిపిస్తోంది. `అర‌వింద స‌మేత ` స‌క్సెస్ మీట్‌లోనూ బ‌రువెక్కిన గుండెతో సెంటిమెంట్‌ని కురిపించి ఆ వేడుక‌లో పాల్గొన్న అభిమానుల చేత కంట‌త‌డి పెట్టించిన జూ.ఎన్టీఆర్ `118` ప్రీరిలీజ్ వేడుక‌లోనూ ఇంచుమించు అలాంటి ప‌నే చేశారు.

వేదిక‌పై ద‌ర్శ‌కుడు గుహ‌న్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్ `118` చిత్రాన్ని చాలా శ్ర‌ద్ధ‌తో తీశార‌ని, `బాద్ షా` సినిమాలోని `బంతిపూల జాన‌కి..` పాట‌ని అద్భుతంగా చిత్రీక‌రించిన గ్రేట్ ఛాయాగ్రాహ‌కుడు అని త‌న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమాలో నివేదా థామ‌స్ న‌టించిన ఓ సీన్ చూస్తున్న‌ప్పుడు తెలియ‌కుండానే క‌న్నీళ్లొచ్చాయ‌ని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌. కొత్త‌గా క‌థ చెప్పాల‌ని అన్న‌య్య ఆస‌క్తి చూపిస్తుంటారు. అన్న‌య్య కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా విజ‌యం త‌న‌కు మ‌రింత స్ఫూర్తి నివ్వాల‌ని కోరుకున్నారు ఎన్టీఆర్‌. ఇదే వేదిక‌పై నంద‌మూరి అభిమాని ఒక‌రు హ‌రికృష్ణ‌తో త‌న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంట త‌డి పెట్టించ‌డం విశేషం. పామ‌ర్రులో త‌న తండ్రి వ‌ద్ద‌నే హ‌రికృష్ణ గారు కిల్లీ కట్టించుకునే వార‌ని అత‌డు గుర్తు చేసుకున్నారు.

తొలిసారి క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తున్న ఈ స‌స్పెన్స్  థ్రిల్ల‌ర్ మార్చి 1న విడుద‌ల కాబోతోంది. `ప‌టాస్‌` త‌రువాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న క‌ల్యాణ్‌రామ్ కు ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ అయినా హిట్టిస్తుందా లేదా అన్న‌ది తెలియాలంటే మార్చి 1 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News