ఫ్లాప్ తీసి గౌరవం పొందే డైరెక్టర్

Update: 2015-10-02 15:29 GMT
సుకుమార్ నిర్మాతగా తీస్తున్న తొలి చిత్రం కుమారి 21ఎఫ్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ మూవీ టీజర్ ను లాంఛ్ చేశాడు. నన్ను  ప్రేమించడానికి నా వివరాలు చాలవా... అంటూ హీరోయిన్ తో అడిగించే క్వశ్చన్ తోనే.. మూవీ ఎలా ఉంటుందో చెప్పేశాడు. అయితే.. ఈ ఫంక్షన్ లో సుకుమార్ పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఎక్కువగా ఆకట్టున్నాయి.

సాధారణంగా సినిమాలు ఫెయిల్ అయితే.. దర్శకులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఎన్టీఆర్.. సుకుమార్ మూవీస్ ఫెయిల్ అయినా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగుంటుందన్నాడు. అంతేకాదు.. సుకుమార్ ఫ్లాప్ సినిమాలని కూడా ఆడియన్స్ గౌరవిస్తారంటూ.. విభిన్నంగా పొగిడాడు. సుకుమార్ సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే.. ఇలా ఎందుకు జరిగిందో ఇండస్ట్రీ అంతా విశ్లేషణలు చేస్తుందంటున్నాడు ఎన్టీఆర్.

అన్నీ బాగానే ఉన్నా.. సుకుమార్ ప్రేక్షకులకు కన్వే చేయలేకపోయిన పాయింట్ ఏం ఉందా అని.. టాలీవుడ్ మొత్తం వెతుకుతూ ఉంటుందట. ఏమైనా.. తన డైరెక్టర్ ని ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేశాడు యంగ్ టైగర్. అయితే.. నాన్నకు ప్రేమతో సంగతులు చెప్పమంటే మాత్రం.. ఆ విషయాలు చెప్పడానికి ఇంకా టైం ఉందంటున్నాడు ఎన్టీఆర్.
Tags:    

Similar News