మూడేళ్లు వెనక్కి వెళ్తే అప్పటికి ఎన్టీఆర్ కు కెరీర్లో ఒక్క 50 కోట్ల షేర్ మూవీ కూడా లేదు. తన తర్వాత వచ్చిన.. తనకంటే తక్కువ స్థాయి అనుకున్న హీరోలు కూడా ఈజీగా 50 కోట్ల మార్కును అందుకుంటుంటే.. ఎన్టీఆర్ మాత్రం వరుస ఫ్లాపులతో వెనకబడిపోయాడు. ఐతే కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లిచ్చిన ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ పరంగా ఢోకా ఏమీ లేదు. కానీ సరైన సినిమాలు పడకపోవడం వల్ల అతడి రేంజ్ అక్కడ ఆగిపోయిందని అందరికీ తెలుసు. నటుడిగా అతడి కేపబిలిటీ ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి.. మంచి హిట్లు ఒకట్రెండు పడితే.. ఎన్టీఆర్ మళ్లీ పూర్వపు స్థాయి అందుకుంటాడని అందరికీ తెలుసు. టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలతో అదే జరిగింది.
‘టెంపర్’తో నిలదొక్కుకున్న ఎన్టీఆర్.. ‘నాన్నకు ప్రేమతో’తో తొలిసారి 50 కోట్ల షేర్ అందుకున్నాడు. ఆ తర్వాత చూశారు అందరూ ఎన్టీఆర్ రేంజ్ ఏంటో. 50 కోట్ల నుంచి ఒకేసారి 80 కోట్ల క్లబ్బులోకి జంప్ చేశాడు తారక్. ‘జనతా గ్యారేజ్’కు డివైడ్ టాక్ వచ్చినా ఆ సినిమా రూ.85 కోట్ల దాకా షేర్ సాధించడం మామూలు విషయం కాదు. దీన్ని బట్టే ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎలా పెరిగిందో.. క్లాస్ ప్రేక్షకుల మెప్పు కూడా ఎలా పొందాడో అందరికీ అర్థమైంది. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ల తర్వాత వస్తున్న ‘జై లవకుశ’పై జనాల్లో అంచనాలు పెంచడంలోనూ ఈ టీం విజయవంతమైంది. దర్శకుడు బాబీ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేకపోయినా.. ‘జై లవకుశ’పై ఆ ప్రభావం ఏమీ పడలేదు.
సినిమా మొదలయ్యాక నిరంతరం దీన్ని వార్తల్లో నిలబెట్టడం ద్వారా క్యూరియాసిటీ జనరేట్ చేశారు. ముఖ్యంగా జై పాత్రకు సంబంధించిన ప్రోమోలన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పుడు సినిమా సూపర్ పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతోంది. దసరా సెలవుల్లో రిలీజ్ చేస్తుండటం.. పైగా గురువారం రిలీజవుతుండటం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ కలిసొస్తుండటంతో ‘జై లవకుశ’కు తొలి వీకెండ్ లోనే మాగ్జిమం రికవరీ ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా సేఫ్ జోన్ లోకి చేరే అవకాశముంది. మూడు హ్యాట్రిక్ హిట్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ సత్తా ఏంటనేది ఈ సినిమాతో చూడొచ్చని కూడా ట్రేడ్ పండితులు అంటున్నారు.