జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన నాన్నకు ప్రేమతో థియేటర్లలోకి వచ్చేసింది. ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్, రకుల్ ప్రీత్ సింగ్ అందాలు, జగపతిబాబు-రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ హీరోల పెర్ఫామెన్స్. డైరెక్టర్ సుకుమార్ ఇంటెలిజెన్స్.. ఇవన్నీ కలిసి అభిమానులను మైమరిపిస్తున్నాయి.
క్లాస్ కంటెంట్ ఎక్కువగా ఉందనే మాట వినిపిస్తున్నా.. ఇది అంతగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. లోపల మేటర్ బాగుంటే.. క్లాస్ మూవీలతో ఏ రేంజ్ మ్యాజిక్ చూపించచ్చో ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. ఆ విషయంపై పూర్తి అవగాహన ఉన్న ఎన్టీఆర్.. నాన్నకు ప్రేమతో మూవీకి వస్తున్న ప్రశంసలపై చాలా హ్యాపీగా ఉన్నాడు. మరోవైపు ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడం కూడా.. కాసుల పంట కురిపిస్తోంది. మొదటి రోజు వసూళ్లలో కొత్త రికార్డు సృష్టించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు.
'ఇంతటి రెస్పాన్స్ రావడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ విజయం కోసం మొత్తం టీం అంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం'అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. అయితే.. నాన్నకు ప్రేమతో ఏ రేంజ్ కు చేరుకోనుందనే విషయం తేలాలంటే మాత్రం.. మొదటి రోజు కలెక్షన్స్ పూర్తిగా వస్తేనే సాధ్యం.