జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను నటించబోయే కొత్త సినిమా కోసం తారక్ తన లుక్ ను మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. బరువు తగ్గి కండలు పెంచిన తారక్ సరికొత్త లుక్ లోకి మారిపోయాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు కొన్ని హల్ చల్ చేశాయి. ఐతే ఇంత కష్టపడి పెంచిన లుక్ ముందే రివీల్ అయిపోవాలని ఎన్టీఆర్ అండ్ కో భావించట్లేదు. తెరమీద సర్ప్రైజ్ చేయాలని భావించింది. కానీ అందుకు అవకాశమే లేకపోయింది. ఆల్రెడీ కొన్ని ఫొటోలు బయటికి రాగా.. ఇప్పుడు ఎన్టీఆర్ నేరుగా జనాల ముందుకు రాక తప్పని పరిస్థితి నెలకొంది.
ఈ నెల 21న ఎన్టీఆర్ కొత్త అవతారాన్ని జనాలు చూడబోతున్నారు. ఆ రోజే తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సినిమా ‘ఎమ్మెల్యే’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. కళ్యాణ్ రామ్ సినిమాను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత తారక్ మీద ఉంది. అతడికి మించిన అతిథిని కళ్యాణ్ రామ్ తేలేడు. దీంతో అన్నయ్య కోసం రాక తప్పట్లేదు. లుక్ రివీల్ చేయక తప్పట్లేదు. మరి ఆ రోజు ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడో చూడాలని నందమూరి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించిన తారక్ ఫొటోలు కొంచెం పాతవని.. అతను ఇప్పుడు మరింత మారాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. మరి తారక్ ఎలా కనిసిస్తాడో చూద్దాం.