స్టూడెంట్ నెంబర్ వన్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. అందులో స్టూడెంట్ పాత్రలో అదరగొట్టాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆది, సుబ్బు లాంటి సినిమాల్లోనూ విద్యార్థిగా కనిపించాడు. ఐతే ‘సింహాద్రి’ సినిమాతో తన ఇమేజ్ పూర్తిగా మారిపోవడంతో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ల మీద అతడి దృష్టి మళ్లింది. దీంతో మళ్లీ ఏ సినిమాలోనూ పూర్తి స్థాయి స్టూడెంట్ పాత్రలో కనిపించలేదు. ఐతే చాలా విరామం తర్వాత యంగ్ టైగర్ మళ్లీ పుస్తకాలు చేతబట్టి కాలేజీకి వెళ్లే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’లోనే కావడం విశేషం.
ఐతే ఎన్టీఆర్ ఇందులో చేయబోయేది పూర్తి స్థాయి స్టూడెంట్ రోల్ కాదు. ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఎన్టీఆర్ విద్యార్థిగా కనిపిస్తాడట. ఐఐటీలో చదివే బ్రిలియంట్ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తాడట యంగ్ టైగర్. ఈ విద్యావిధానంలో ఇమడలేక ‘జనతా గ్యారేజ్’ పేరుతో షెడ్డు పెట్టి తన అభిరుచికి తగ్గ పని చేస్తాడట ఎన్టీఆర్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ చాలా యంగ్ గా కనిపిస్తాడని.. ఈ గెటప్ విషయంలోనూ చాలా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మూడు నెలల కిందటే పూజా కార్యక్రమాలతో మొదలైన ‘జనతా గ్యారేజ్’ ఈ నెల 22న సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తుండగా.. మోహన్ లాల్, సాయికుమార్, ముకుందన్, దేవయాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.