ఐ వానా ఫాలో ఫాలో.. అంటూ ఎన్టీఆర్ లండన్ వీధుల్లో రకుల్ ప్రీత్ కోసం పాడుతూ పోతుంటే.. అందరి కన్నూ ఒక విషయం మీదనే పడుతుంది. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా. దాదాపు వెయ్యి డాలర్లు ఖరీదైన ఆ టూ వీలర్ స్కేటింగ్.. ఇంటెలిజెంట్ హోవర్ బోర్డ్ ఉంది చూశారూ.. అందరూ ఇప్పుడే అదే కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఇండియాలో ఇప్పుడవి 25 వేలకు కూడా దొరికేస్తున్నాయిలే.
ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే.. అసలు ఈ హోవర్ బోర్డుపై ఎన్టీఆర్ కన్ను ఎలా పడింది? మనోడు దీనిని సినిమాలోకి ఎలా తీసుకొచ్చాడు? అది ఎవరి ఐడియా. నిజానికి లండన్ లో రోజూ తన ఫిజిక్ ను ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ చేశేవాడట తారక్. ఆ సమయంలో అక్కడికి ఓ ఇద్దరు ముగ్గురు ఆ హోవర్ బోర్డుపై రావడం చూశాడట. ఇదేదో బాగుంది.. మనం కూడా కొనుక్కుందాం అంటూ తన కాస్ట్యూమ్ డిజైనర్ అశ్విన్ కు ఆ విషయం చెప్పేశాడట. మనోడు నాలుగు రోజులు వెతికి.. ఆ హోవర్ బోర్డులను అమ్మే స్టోర్ ఒకటి తెలుసుకున్నాడు. కాని రేటు ఎక్కువగా ఉండటంతో అశ్విన్ కొనుక్కోలేదు.. ఎన్టీఆర్ మాత్రం ఒకటి తెచ్చుకున్నాడు. హోటల్ రూమ్ కి తీసుకొచ్చాక దానిని భద్రంగా సెల్ఫ్ లో ఎందుకు పెడతాడు చెప్పండి?
ఒక రోజు ఎన్టీఆర్ ఆ బోర్డు పైన హోటల్ కారిడార్ లో చెక్కెర్లు కొడుతుంటే.. అది చూసిన సుకుమార్ అవాక్కయ్యాడట. ఇదేదో బాగుందే.. దీనిని సినిమాలో కూడా వాడేద్దాం అంటూ.. ఫాలో ఫాలో సాంగులోకి దానిని తీసుకొచ్చేశారట. హోటల్ లో ఎన్టీఆర్ ఈ హోవర్ బోర్డును ఎలా వాడుతున్నాడో డైరక్టరు గారు చూడటంతో.. ఈ కాళ్లకు చక్రాలు తెరపైకి వచ్చేశాయి. హోవర్ బోర్డుకుపై ప్రేమతో!!