భ‌విష్య‌త్ అభ‌య తార‌క మంత్ర‌మే

Update: 2015-10-27 05:20 GMT
సార్వ‌భౌమ ఎన్టీఆర్.. అస‌లు ఈ పేరు నంద‌మూరి వంశంలో ఎంద‌రు హీరోలు ఉన్నా ఒకే ఒక్క హీరోకి మాత్ర‌మే ఆపాదించారు జ‌నం. న‌వ‌ర‌స న‌ట సార్వ‌భౌమునికి సిస‌లైన న‌ట వార‌సుడు ఎవ‌రు అంటే... హ‌రికృష్ణ త‌న‌యుడు తార‌క్ మాత్ర‌మేన‌ని జ‌నాలే ఫిక్స్ చేసేశారు. బాహుశా పెద్దాయన పోలికలు అచ్చు గుద్దినట్లు తారక్‌ లో ఉండటమే అందుకు ప్రధాన కారణమేమో.

నంద‌మూరి వంశంలోని యంగ్‌ తరంలో గ్రేట్ యాక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారు అంటే అది సింహాద్రి ఎన్టీఆర్ మాత్ర‌మే. ఇక నంద‌మూరి వంశం నుంచి మ‌రో చుర‌క‌త్తిలాంటి నాలుగో జ‌న‌రేష‌న్ వార‌సుడు రంగంలోకి దూసుకొస్తున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ జూనియ‌ర్‌ కి పూర్తిగా పోటీ అనే అనుకోవ‌చ్చు. ఇప్ప‌ట్నుంచే అటు రాజ‌కీయ‌ప‌రంగా, ఇటు సినిమాటిక్‌ గా మోక్ష‌జ్ఞ కెరీర్‌ ని పీక్స్‌ లో ఊహిస్తున్నారంతా. అయితే నాలుగో జనరేషన్ కంటే ముందే.. ఐదో జనరేషన్‌ యాక్టర్‌ కూడా రెడీ అవుతున్నాడా అంటే అవుననే అంటున్నారు జనాలు.

యంగ్ టైగర్‌ ఇప్పుడు అభ‌య‌తార‌క మంత్రాన్ని జ‌పిస్తున్నాడు. నిన్న‌టికి నిన్న తన సినిమా ఓపెనింగ్‌ లో ఇదిగో నా వార‌సుడు అంటూ అభ‌య్‌ రామ్‌ ని యావ‌త్ లోకానికి చూపించాడు. అంత‌మంది జ‌నాల్లో త‌న భుజాల‌కెత్తుకుని బిడ్డ‌ని సంబ‌రంగా అంద‌రికీ ప‌రిచ‌యం చేశాడు. దాన వీర సూర క‌ర్ణుడిలో ఏ పాత్ర‌కైనా నేను సూట‌బుల్ అన్న‌ట్టే ఉంది అభ‌య్‌ రామ్ ఎక్స్‌ ప్రెష‌న్‌. మ‌ళ్లీ నంద‌మూరి వంశంలో మ‌రో చుర‌క‌త్తి రాబోతున్నారు అంటే అది అభ‌య్‌ రామ్ అని చెప్ప‌క‌నే చెప్పింది ఈ ఇన్సిడెంట్‌. అయితే అత‌డు హీరోగా రంగంలోకి దిగ‌డానికి ఇంకా 15 సంవ‌త్స‌రాలు పైనే వేచి చూడాలి. అది సంగతి.
Tags:    

Similar News