గ్యాప్ కారణంగా చెమటోడుస్తున్న ఎన్టీఆర్

Update: 2017-02-02 12:20 GMT
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ముహూర్తం షాట్ తోపాటు.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే తేదీని కూడా అనౌన్స్ చేసేశారు. ఈ నెల 15నుంచి యంగ్ టైగర్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కువగా వర్కవుట్స్ చేస్తూ.. సన్నబడేందుకు బాగా కష్టపడుతున్నాడు.

జనతా గ్యారేజ్ మూవీలో సాధారణంగానే కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత సినిమాను ఫైనల్ చేసేందుకే చాలా టైం తీసుకున్నాడు. జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి ఇప్పటికి ఐదు నెలలు గడిచిపోవడం.. ఈ టైంలో ఎక్కువ సమయం పార్టీలు.. ఎంజాయ్మెంట్ కు కేటాయించడంతో.. కొంచెం లావుగా మారిపోయాడట ఎన్టీఆర్. కానీ ఇప్పుడు జై లవ కుశ అనే టైటిల్(ఫైనల్ చేయలేదు) పై తెరకెకక్కనున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సన్నగా కనిపించాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించనుండగా.. వీటిలో ఒకటి విలన్ రోల్ అని గతంలోనే చెప్పుకున్నాం.

ఇప్పుడీ జై లవ కుశ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండడంతో.. విపరీతంగా కష్టపడుతున్నాడట జూనియర్. మళ్లీ సన్నగా ఉండే లుక్ కోసమే ఈ కష్టాలన్నీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవోలో హీరోయిన్లుగా రాశి ఖన్నా, నివేదా థామస్ లను ఫైనల్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News