కొమరం భీమ్ లుక్ కోసం 18 నెలలు కష్టపడిన ఎన్టీఆర్!

Update: 2022-09-10 15:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ యాక్షన్ ..  ఆయన డాన్స్.. డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. తన పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం ..  పాత్రలో ఒదిగిపోవడం కోసం ఎన్టీఆర్ ఎంతకష్టమైనా పడుతుంటాడు. అభిమానులను మెప్పించడం కోసం ఆయన చేసే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమానే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన  'ఆర్ ఆర్ ఆర్' ఈ ఏడాది మార్చిలో థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి భాషలో .. ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు.

ఈ కథలో కొమరం భీమ్ పాత్ర చాలా పవర్ఫుల్. లుక్ పరంగా కూడా ఈ పాత్ర చాలా బలిష్ఠంగా ఉండాలి. అందువలన ఎన్టీఆర్ బరువు పెరగవలసి వచ్చింది .. అందుకు తగిన ఫిట్ నెస్  కోసం జిమ్ లో వర్కౌట్లు చేయవలసి వచ్చింది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్  ఎంత కష్టపడ్డాడనేది తెరపై ఆయనను చూసినవారికి అర్థమైపోయింది.

ఈ సినిమాలో రాజమౌళి  అనుకున్న విధంగా కనిపించడానికి ఎన్టీఆర్ 18 నెలలు కష్టపడ్డాడట. ఆ సమయంలో ఆయన క్రమం తప్పకుండా వర్కౌట్లు చేసేవారనీ, ఆయన అంకితభావం చూసి తాను షాక్ అయ్యానని ఎన్టీఆర్ కి  ఫిట్ నెస్ ట్రైనర్ గా చేసిన లాయిడ్ స్టీవెన్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

నిజంగానే ఈ సినిమాలో మనకి ఎన్టీఆర్ కాకుండా కొమరం భీమ్ కనిపిస్తాడు. యాక్షన్ లోను .. ఎమోషన్ లోను కొమరం భీమ్ కళ్లముందు కదలాడతాడు. ఆ పాత్రలో అంతగా ఆయన ఒదిగిపోవడానికి కారణం ఆయన పడిన కష్టమే .. చేసిన కసరత్తే.

ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన తన 30వ సినిమా చేయవలసి ఉంది. కొరటాల దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేయవలసి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతోంది. ఈ సినిమాలోనూ కథకి తగినట్టుగా ..

తన పాత్రకి తగినట్టుగా కనిపించడానికి ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News