నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఎట్టకేలకు ఈ రోజు ఎటువంటి హడావిడి లేకుండా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరబాద్ నగర శివార్లలో షూటింగ్ సెట్ నుంచి విడుదలైన కొన్ని ఫోటోలు నిముషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.
ఈ ఫోటోల్లో బ్లాక్ షూస్- ఇన్ షర్ట్ వేసుకుని ట్రిమ్ చేసుకున్న గడ్డంతో యమా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు తారక్. ఆయన పక్కనే త్రివిక్రమ్ తనదైన డ్రెస్సింగ్ తో నిల్చున్నాడు. ఆయన భుజంపై ఎర్రని శాలువా ఒకటి ఉంది. మరో పక్క నిర్మాత రాధాకృష్ణ నిల్చున్నాడు. యంగ్ టైగర్ అభిమానులు చాలా రోజులుగా ఈ కాంబోలో సినిమా చూడాలని కలలు కంటున్నారు. టెంపర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తాడనే వార్తలు వచ్చినా కార్యరూపం దాల్చడానికి చాలా సమయమే పట్టింది. డీజే భామ పూజా హెగ్దే ఇందులో తారక్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాను ఒకే షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం ముగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
జైలవకుశ చిత్రం అప్పుడెప్పుడో గత ఏడాది సెప్టెంబర్లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్.టీ.ఆర్ ఖాళీగానే ఉన్నాడు. ఇప్పుడు... అప్పుడు అంటూ వాయిదాలు పడుతూ వచ్చిన ఎట్టేకేలకు ప్రారంభం కావడంతో ఎన్.టీ.ఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ కోసం ఓ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడని సమాచారం.