యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత వీరి కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తారక్ కెరీర్ లో 30వ చిత్రంగా రూపొందనున్న '#NTR30' ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది.. ఇందులో ఎన్టీఆర్ ఎలా చూపించబోతున్నారనేది సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో '#NTR30' సినిమా స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే 'భరత్ అను నేను' సినిమాలో రాజకీయాల గురించి చర్చించిన కొరటాల.. ఈ చిత్రంలో విద్యార్థి రాజకీయాల గురించి చర్చించబోతున్నాడట. ఇందులో తారక్ విద్యార్థి నాయకుడిగా.. యువ నేతగా కనిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో దొరికిన ఈ సమయాన్ని కొరటాల స్క్రిప్ట్ లో మెరుగులు దిద్దడానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'.. కొరటాల తెరకెక్కిస్తున్న 'ఆచార్య' సినిమాలు పూర్తయితే వీరి కాంబోలో రెండో సినిమా స్టార్ట్ అవుతుంది.