ఆదివారం రాత్రి బిగ్ బాస్ -2 అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సారి బిగ్ బాస్ షో లో కొత్తగా కామన్ మ్యాన్ కేటగిరీలో ముగ్గురు సామాన్యులను నిర్వాహకులు ఎంపిక చేశామని చెప్పారు. విజయవాడకు చెందిన మోడల్ మిస్ సంజన అన్నె - పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నూతన్ నాయుడు - రేడియో జాకీ గణేష్ లు ఆ కేటగిరీలో ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురు కంటెస్టంట్ల ప్రొఫైల్‌లను బట్టి వారిలో ఇద్దరు కామన్ మ్యాన్ కాదనిపిస్తోంది. అందాల పోటీలో పాల్గొని - మిస్ హైదరాబాద్ లెవెల్ కు వెళ్లిన సంజన....త్వరలో మిస్ ఇండియాకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఆమె సెలబ్రిటీ కేటగిరీ అవుతారు గానీ....కామన్ మ్యాన్ ఎలా అవుతారని పలువురు అనుకుంటున్నారు. ఇక మరో కంటెస్టెంట్ నూతన్ కు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉందని - త్వరలోనే ఓ రాజకీయ పార్టీలో చేరబోతోన్న ఈ సోషల్ యాక్టివిస్ట్ కామన్ మ్యాన్ ఎలా అవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది తెలుగుతో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ -1 విజేతగా శివ బాలాజీ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ షోలో హరితేజ గెలుస్తుందని అంతా భావించారు. అయితే, ఓటింగ్ లో శివ బాలాజీకి పవన్ ఫ్యాన్స్ మద్దతుండడంతోపాటు మరికొన్ని కారణాల వల్ల శివబాలాజీ విజేతగా నిలిచాడని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అదే తరహాలో బిగ్ బాస్-2లో పాల్గొంటోన్న నూతన్ త్వరలో జనసేనకు జై కొట్టబోతోన్నారని వదంతులు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ - సమైక్యాంధ్ర పార్టీకి మద్దుతు పలికిన నూతన్ నాయుడు....త్వరలో జనసేనలో చేరబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేసిన నూతన్ నాయుడుకు పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సోషల్ సర్వీస్ చేస్తోన్న నూతన్ కామన్ మాన్ ఎలా అవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక సంజన - నూతన్ కాకుండా విజయవాడకు చెందిన ఆర్ జే గణేష్ నే కామన్ మ్యాన్ కేటగిరీలో అసలు సిసలు కామన్ మ్యాన్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.