మొదటిసారి అలా మెరుస్తున్న సోనా

Update: 2016-11-04 09:30 GMT
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అరంగేట్రం నుంచే మాస్ సినిమాలలో కుమ్మేసింది. కొన్నేళ్ల పాటు.. సోనాక్షి లేకుండా ఆమె చిందులు లేకుండా మాస్ మూవీ కనిపించలేదు కూడా. అంతగా ఊర మాస్ కేరక్టర్లను ఇరగదీసేయడం ఈ బ్యూటీ స్పెషాలిటీ. అయితే.. ఎంత మాసీగా గెంతులు వేసినా.. ఎప్పుడూ శృతి మించి కాదు కదా.. మించకుండా కూడా అందాల ఆరబోత చేయలేదు సోనాక్షి సిన్హా.

ఇప్పుడీ దబాంగ్ బ్యూటీ ట్రెండ్ మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం జాన్ అబ్రహాంతో నటిస్తున్న ఫోర్స్2 మూవీ కోసం బాగా కష్టపడిపోతున్న సోనాక్షి.. ఓ మోస్తరు వరకూ అందాల విందు కూడా చేయనుంది. ఓ జానియా అంటూ సాగే పాట రిలీజ్ చేయగా.. ఇందులో అమ్మడు నాబి షోకులతో పాటు నడుం అందాలను కూడా ప్రదర్శించేసింది. బొద్దు బ్యూటీ అనే బిరుదు ఉండడంతో.. ఇలాంటి స్కిన్ షో విషయంలో ఇన్నేళ్లూ బాగా ఆలోచించేది కానీ.. ఈ మధ్య అకీరా మూవీ కోసం బాగా కష్టపడిపోయి బాడీని బాగానే తగ్గించేసింది.

ఆ అనుభవం.. సంపాదించుకున్న సోయగం.. ఇలా స్కిన్ షో కోసం వాడేస్తోందన్న మాట. రీజన్ ఏదైనా కానీ.. సోనాక్షి సిన్హా కూడా నడుము నుంచి నాభి వరకూ ప్రదర్శనకు ఉంచేయడం.. అభిమానులకు కొత్త అందాలను చూపించడమే కాదు.. అనుభూతులను కూడా మిగిల్చేస్తోంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News