శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహాసముద్రం సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ అయ్యిందట. దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథపై నమ్మకంతో నిర్మాత అనీల్ సుంకర భారీగా ఖర్చు పెడుతున్నాడట.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో మహాసముద్రం నిలిచి పోయే సినిమా గా మారుతుందని.. తమ బ్యానర్ కు పేరు తీసుకు వచ్చే సినిమా అవుతుందనే ఉద్దేశ్యంతో అనీల్ సుంకర కాస్త ఎక్కువ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మహాసముద్రం బడ్జెట్ పరిధి దాటి పోయినా కూడా ఏమాత్రం ఆందోళన లేకుండా షూటింగ్ ను మరింత ఉత్సాహంతో కొనసాగిస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల వారి టాక్.
మహా సముద్రం సినిమా లో శర్వానంద్ తో పాటు కీలక పాత్రలో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు ఇతర వర్కింగ్ స్టిల్స్ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమా ను ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ లేదా మరేదైనా కారణం వల్ల ఆలస్యం అయినా కూడా వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాలో హీరోయిన్స్ గా అను ఎమాన్యూల్ మరియు అతిథి రావు హైదరిలు నటిస్తున్నారు. సినిమా ను సెకండ్ వేవ్ కు ముందు ఆగస్టు 19న రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
విడుదల తేదీ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. మహాసముద్రం సినిమా కోసం దర్శకుడు అజయ్ భూపతి చాలా కాలం వెయిట్ చేశాడు. పలువురు హీరోలకు కథను వినిపించాడు. పలువురు చేసేందుకు ఓకే అన్నారు కాని ఏదో ఒక కారణం వల్ల ముందుకు సాగలేదు.
విలక్షణ కథలను ఎంపిక చేసుకునే శర్వానంద్ కు మహాసముద్రం కథ బాగా నచ్చడంతో వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడట. ఆర్ ఎక్స్ 100 సినిమా తో విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి వర్మ స్కూల్ నుండి వచ్చిన శిష్యడు అనే విషయం తెల్సిందే.
అయితే తన సినిమా లపై వర్మ ప్రభావం మాత్రం అంతగా కనిపించుకుండా ప్రయత్నిస్తున్నాడు. తనకంటూ సొంత స్టైల్ ను ఏర్పర్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.