అక్టోబ‌ర్‌లో భారీ సినిమాల జాత‌ర‌

Update: 2015-09-17 17:30 GMT
సెప్టెంబ‌ర్ మాసం సెప్టెంబ‌ర్ మాసం.. పాత బాధలు త‌లెత్తుకున్నాయ్‌.. అక్టోబ‌ర్ మాసం అక్టోబ‌ర్ మాసం కొత్త బాధ‌లు త‌లెత్తుకున్నాం. బాధ తీరున‌దెపుడో... ఈ పాట గుర్తు  చేసుకోవాల్సిన సంద‌ర్భ‌మిది. స‌ఖి సినిమాలోని ఈ పాట సినిమాకే హైలైట్. ఇపుడు సెప్టెంబర్ మాసం వెళ్లిపోయి అక్టోబ‌ర్ మాసం రావ‌డానికి ప‌క్షం రోజులు కూడా లేదు. అందుకే పాత బాధ‌లు వ‌దిలేసి కొత్త బాధ‌లు త‌లెత్తుకోవ‌డానికి టాలీవుడ్ రెడీ అవుతోంది.

ఈ ఏడాది ద్వితీయార్థం ఆరంభ‌మే బాహుబ‌లి లాంటి భారీ విజ‌యాల్ని చ‌విచూసిన ప‌రిశ్ర‌మ , ఆ వెంట‌నే బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్లు చూస్తోంది. బాహుబ‌లి ఆ త‌ర్వాత శ్రీ‌మంతుడు భారీ విజ‌యాల్ని సాధించాయి. వీటితో పాటే చిన్న బ‌డ్జెట్‌ లో వ‌చ్చిన  సినిమా చూపిస్త మావ‌ - భ‌లే భ‌లే మ‌గాడివోయ్ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపేశాయి. సినిమా చూపిస్త మావ కేవ‌లం 5కోట్ల‌తో తెర‌కెక్కి 10 కోట్లు పైగా వ‌సూళ్లు తెచ్చింది. అలాగే నాని హీరోగా న‌టించిన బిబిఎం 9 క ఓట్ల‌తో తెర‌కెక్కి 20 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఇంత‌టి అసాధార‌ణ విజ‌యాల్ని చిన్న సినిమాలు కూడా అందుకోవ‌డంతో నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్ ల‌లో హుషారు పెరిగింది. థియేట‌ర్ లు కొత్త సినిమాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ్‌. హిట్లొస్తుంటే హుషారు పెరుగుతుంది. నాలుగు డ‌బ్బులు క‌ళ్ల జూసిన సీజ‌న్ ఇది అని చెబుతున్నారు డి.సురేష్‌ బాబు లాంటి పంపిణీదారుడు కం నిర్మాత‌. ఈ విజ‌యాల్ని పుర‌స్క‌రించుకుని ద‌స‌రా రేసులో భారీ సినిమాల జాత‌ర మొద‌లవుతోంది. ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. అంద‌రూ ఉర‌క‌లెత్తుకుంటూ వ‌చ్చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. న‌వంబ‌ర్ మాసం క‌లిసిరాదు అన్న సెంటిమెంటుతో ఇప్పుడున్న వాళ్లంతా ఈ అక్టోబ‌ర్‌ లోనే వ‌చ్చేయాల‌ని కంగారు ప‌డిపోతున్నారు. ఈ నెల‌లో ద‌స‌రా సెల‌వుల్ని క్యాష్ చేసుకోవాల‌న్న‌దే నిర్మాత‌ల త‌ప‌న‌.. అంటూ చెప్పుకొచ్చారు.

అక్టోబ‌ర్ లో రిలీజ‌వుతున్న మొద‌టి భారీ సినిమా రుద్ర‌మ‌దేవి 3డి. ఈ చిత్రాన్ని 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత అదే నెల 16న చ‌ర‌ణ్ హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న బ్రూస్ లీ రిలీజ‌వుతుంది. ఆ వెంట‌నే అక్టోబ‌ర్ 21న అఖిల్ హీరోగా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖిల్ సినిమా రిలీజ‌వుతోంది. ఈ సినిమాల‌న్నీ భారీ కాన్వాసుతో తెర‌కెక్కిన‌వే. అయితే ఈ భారీ సినిమాల రిలీజ్‌ ల‌కు ముందే అక్టోబ‌ర్ 2 న రామ్ హీరోగా న‌టించిన శివ‌మ్‌ వ‌రుణ్‌ తేజ్ హీరోగా న‌టించిన కంచె రిలీజ‌వుతున్నాయి. మొత్తానికి అర‌డ‌జ‌ను పైగానే క్రేజీ సినిమాలు ఈ ద‌స‌రా బ‌రిలో దిగుతున్నాయ్‌. 200 కోట్ల పందేరం ముందుంది. అంత భారీగా బ‌డ్జెట్‌లు ఖ‌ర్చు చేశారు కాబ‌ట్టి ఆ మేర‌కు వ‌సూళ్లు కూడా భారీగా రాబ‌ట్టాల్సి ఉంటుంది.

అయితే ఒక‌దాని వెంట ఒక‌టిగా సినిమాలు రిలీజ‌వ్వ‌డం వ‌ల్ల ఒక సినిమాకి హిట్ టాక్ వ‌చ్చినా ఆ వసూళ్ల‌ను వేరొక సినిమా షేర్ చేసుకోవాల్సి వ‌స్తుంది. అందువ‌ల్ల న‌వంబ‌ర్‌ కి వాయిదా వేసుకోమ‌ని చెప్పినా వినే ప‌రిస్థితి లేనేలేద‌ని వాపోయారు ఓ అగ్ర నిర్మాత‌. బెట్టింగ్ సీజ‌న్‌ల ఎవ‌రినీ ఆప‌లేమ‌ని వ్యాఖ్యానించారు. ఎనీ వే ఆల్ ది బెస్ట్‌.
Tags:    

Similar News