అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అంతకు ముందు చేసిన ‘డీజే’ చిత్రం కూడా యావరేజ్ గానే నిలవడంతో అల్లు అర్జున్ ఈసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. కెరీర్ లోనే ఎప్పుడు లేనంతగా ఆరు నెలలకు పైగా సినిమాలు ఏమీ చేయకుండా ఉన్నాడు. ఎట్టకేలకు అల్లు అర్జున్ మూవీ పట్టాలెక్కేందుకు సిద్దం అయ్యింది.
‘నా పేరు సూర్య’ చిత్రం విడుదల కాగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక మూవీని చేయాలని బన్నీ భావించాడు. కాని అనూహ్యంగా ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చాడు. అరవింద సమేత చిత్రంతో సూపర్ హిట్ ను దక్కించుకున్న త్రివిక్రమ్ తో మరో ఆలోచన లేకుండా అల్లు అర్జున్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ పట్టాలెక్కబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను హిందీ సినిమాకు రీమేక్ గా త్రివిక్రమ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా ప్రారంభం సమయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో సక్సెస్ లను దక్కించుకున్న ఈ కాంబో హ్యాట్రిక్ దక్కించుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రంను రాధాకృష్ణ మరియు అల్లు అరవింద్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. కొత్త సంవత్సరం కానుకగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Full View