మ్యాజిక్‌ అక్కడ కూడా రిపీట్‌ అయ్యేనా?

Update: 2020-10-02 05:30 GMT
విజయ్‌ దేవరకొండను వెలుగులోకి తీసుకు వచ్చిన చిత్రం 'పెళ్లి చూపులు'. సింపుల్‌ కథతో రూపొందిన ఆ సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్‌ దక్కింది. స్లో పాయిజన్‌ మాదిరిగా ఆ సినిమా ప్రేక్షకులకు ఎక్కింది. విజయ్‌ దేవరకొండ మ్యానరిజంకు ప్రేక్షకులు మెస్మరైజ్‌ అవ్వడంతో పాటు యూత్‌ ఆడియన్స్‌ ను కట్టి పడేసే కామెడీ వల్ల ఇక్కడ అక్కడ వారు వీరు అనే తేడా లేకుండా అందరు సినిమాను బాగా చూశారు. సినిమాకు పెట్టిన పెట్టుబడికి చాలా రెట్ల లాభాలు రావడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు సైతం దక్కిందనే విషయం తెల్సిందే. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా ప్రస్తుతం తమిళంలో రీమేక్‌ అవుతోంది. తాజాగా ఆ రీమేక్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల అయ్యింది.

ఒరిజినల్‌ వర్షన్‌ లో విజయ్‌ దేవరకొండ చేసిన పాత్రను తమిళ నటుడు హరీష్‌ కళ్యాణ్‌ పోషిస్తుండగా హీరోయిన్‌ గా ప్రియ భవానీ శంకర్‌ నటిస్తోంది. తమిళ నేటివిటీకి తగ్గట్లుగా స్వల్ప మార్పులు చేసి సినిమాను ఉన్నది ఉన్నట్లుగానే దించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ ను చూస్తుంటే అర్థం అవుతోంది. ఓమన పన్నే టైటిల్‌ తో తమిళ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. ఈ రీమేక్‌ కు కార్తీక్‌ సుందర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో విజయ్‌ దేవరకొండ మరియు ప్రియదర్శి మ్యాజిక్‌ తో సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. మరి తమిళంలో ఆ రీమేక్‌ రిపీట్‌ అయ్యేనా అనేది చూడాలి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ రీమేక్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Tags:    

Similar News