ఒలంపిక్స్‌ విజేత వద్ద మెగా హీరో ట్రైనింగ్‌

Update: 2019-03-08 17:10 GMT
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఈ ఏడాది 'ఎఫ్‌ 2' చిత్రంతో మంచి ఓపెనింగ్‌ ను దక్కించుకున్నాడు. ఎఫ్‌ 2 ఇచ్చిన జోష్‌ తో ఇప్పటికే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే చిత్రానికి కమిట్‌ అవ్వడం, ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా అయ్యింది. ఒక వైపు వాల్మీకి సినిమాకు సిద్దం అవుతూనే మరో వైపు ఆ తర్వాత సినిమా కోసం ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. హరీష్‌ శంకర్‌ మూవీ వచ్చే నెలలో పట్టాలెక్కనుండగా, వరుణ్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో చేయబోతున్న మరో మూవీ ఆగస్టులో ప్రారంభం కాబోతుంది.

వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌ గా నటించబోతున్న సినిమాతో కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఆ సినిమా కోసం బాక్సింగ్‌ ట్రిక్స్‌ ను నేర్చుకునేందుకు 2008 సమ్మర్‌ ఒలింపిక్స్‌ కాంశ్య విజేత టోనీ జాఫ్రెస్‌ వద్ద ట్రైనింగ్‌ అవుతున్నాడు. ప్రస్తుతం లాస్‌ ఏంజిల్స్‌ లో వరుణ్‌ తేజ్‌ బాక్సింగ్‌ ట్రైనింగ్‌ లో ఉన్నాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సిద్దుముద్ద మరియు అల్లు వెంకటేష్‌ లు నిర్మించబోతున్నారు. అల్లు అరవింద్‌ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. టైటిల్‌ ఇంకా ఫిక్స్‌ కాని ఈ చిత్రంను 2020 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. వరుణ్‌ తేజ్‌ ఫిజిక్‌ కు బాక్సర్‌ పాత్ర చాలా బాగుంటుందని, తప్పకుండా ఆ సినిమాతో కూడా ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వాల్మీకి చిత్రం ఇదే ఏడాదిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్‌ మూవీ రానుంది. ఈ రెండు చిత్రాలు కూడా వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ లో మంచి విజయాలుగా నిలుస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News