‘ఓం నమో వేంకటేశాయ’ ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. కొన్నిసార్లు సరైన టైమింగ్ లో రిలీజ్ కాకపోవడం వల్ల మంచి సినిమాలు కూడా దెబ్బ తింటుంటాయని.. అలాగే కొన్నిసార్లు బాగా లేని సినిమాలు కూడా మంచి టైమింగ్ లో రిలీజవడం వల్ల ఇరగాడేస్తుంటాయని చెప్పాడు. ‘ఓం నమో వేంకటేశాయ’ విషయంలో మొదటిదే జరుగుతోంది. ఈ సినిమాకు మంచి రివ్యూలొచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా బాగుంది. అయినప్పటికీ ఈ చిత్రానికి ఆశించిన వసూళ్లు లేవు. ఫస్ట్ వీకెండ్లో మరీ తక్కువగా.. కేవలం రూ.6.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రూ.40 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమాకు ఈ ఓపెనింగ్స్ ఎంతమాత్రం సరిపోవు. వసూళ్లు పెరగని పక్షంలో ఈ సినిమాను నమ్ముకున్న అందరికీ భారీ నష్టాలు తప్పవు. ఒక చెత్త సినిమా తీసి.. దాని ద్వారా నష్టపోతే ఓకే అనుకోవచ్చు. కానీ ఒక మంచి సినిమా తీసి కూడా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తే చాలా బాధ కలుగుతుంది.
మంచి సినిమాలు రావట్లేదు రావట్లేదు అనే ప్రేక్షకులు.. ఒక మంచి సినిమా వచ్చినపుడు ఆదరించకపోతే అది తప్పిదమే అవుతుంది. గత ఏడాది ‘మనమంతా’ లాంటి మంచి.. వైవిధ్యమైన సినిమాకు ఇలాంటి అన్యాయమే జరిగింది. చంద్రశేఖర్ యేలేటి గొప్ప సినిమా తీస్తే దానికి అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. ఇప్పుడు ‘ఓం నమో వేంకటేశాయ’ విషయంలోనూ అలాగే జరుగుతోంది. ఇది వేంకటేశ్వరుడి భక్తులైన ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తిరుమలకు సంబంధించి ఎన్నో కొత్త విషయాల్ని ఆసక్తికరంగా చెప్పారిందులో. దేవుడు-భక్తుడు బంధాన్ని చాలా గొప్పగా చూపించాడు రాఘవేంద్రుడు. నాగార్జున నటన గురించి.. కీరవాణి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. భక్తి సినిమా అనగానే ఒక మూసలో సాగిపోతుందని.. అనాసక్తికరంగా ఉంటుందని యూత్ వెనుకంజ వేయాల్సిన పని లేదు. ఆద్యంతం ఆసక్తికరంగానే సాగుతుంది ఈ సినిమా. ‘ఓం నమో వేంకటేశాయ’ లాంటి సినిమాను ఆదరించకుంటే మున్ముందు ఇంకెవరూ ఇలాంటి మంచి ప్రయత్నాలు చేయరు. అందుకే ఇలాంటి సినిమాను ఆదరించడం ప్రేక్షకుల బాధ్యత.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/