ఒక ప్రముఖుడు పోగానే ఆ వ్యక్తి లేని లోటు తీర్చలేనిది అంటుంటాం. ఐతే చాలా వరకు ఇది మొక్కుబడి వ్యాఖ్యానమే. కానీ కొందరికి మాత్రం ఇది నూటికి నూరు శాతం వర్తిస్తుంది. ఓంపురి ఆ కోవకే చెందుతారు. నటుడిగా ఇప్పటికీ ఆయన గొప్ప గొప్ప పాత్రలు చేస్తున్నారు. దర్శకులు ఆయన్ని ఉద్దేశించి మంచి పాత్రలు రాస్తున్నారు. ఓంపురి తన ప్రత్యేకతను చూపిస్తున్నారు. ఇంకో దశాబ్దం పాటు సినిమాల్లో కొనగాగగలిగే సత్తా ఉందాయనకు. కానీ ఇంతలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. ఓంపురి మృతి సినీ ప్రియుల్ని తీవ్రంగా బాధించేదే కానీ.. ఆయన చనిపోయిన తీరు మాత్రం ఒకరకంగా ఆయన అభిమానులకు కొంత సంతోషాన్నిచ్చేదే. ఓంపురి తన మరణం ఎలా ఉండాలని కోరుకున్నారో అలాగే చనిపోవడం విశేషం.
రెండేళ్ల కిందట ఓ సినిమా వేడుకలో ఆయన తన మరణం ఎలా ఉండొచ్చో అంచనా వేస్తూ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ‘‘నాకు చావంటే భయంలేదు కానీ అనారోగ్యానికి గురవడం అంటే భయం. ఆరోగ్యం పాడై.. మంచాన పడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పక్కవారిపై ఆధారపడే వారిని చూసినప్పుడల్లా నాకూ అదే పరిస్థితి వస్తుందేమోనన్న భయం కలుగుతుంది కానీ.. చావంటే మాత్రం భయం లేదు. చావును కూడా ఎవరూ ముందే ఊహించలేరు. ఎప్పుడో ఒకప్పుడు నేను నిద్రలో కన్ను మూస్తాను. నిన్న రాత్రి ఫలానా సమయానికి ఓంపురి చనిపోయారు.. అంటూ ఉదయం వార్త ప్రజలకు తెలుస్తుంది. నా మరణం ఇలా ఉండాలని కోరుకుంటున్నా’’ అని ఓంపురి ఆ ప్రసంగంలో చెప్పారు. ఆయన అన్నట్లుగానే మంచాన పడి ఇబ్బందులేమీ పడకుండా గుండెపోటుతో సింపుల్ గా చనిపోయారు. ఇలా తాను కోరుకున్నట్లు ప్రశాంతంగా చనిపోయినందుకు ఓంపురి అదృష్టవంతుడే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/