పవన్ కొడుకు అకీరా నిజమైన పోస్టు కాదది..

Update: 2019-04-07 10:45 GMT
ఏపీ  ఎన్నికల్లో కష్టపడుతున్న నాన్న పవన్ కళ్యాణ్ గెలవాలని ఆశిస్తూ ఫేస్ బుక్ లో అకీరా నందన్ పేరుతో చేసిన పోస్టు వైరల్ అయిన సంగతి తెలిసిందే.. తండ్రి పవన్ కోసం కొడుకు అకీరా బాధపడుతూ చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. అంతేకాదు.. పవన్ ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను కూడా అందులో పోస్టు చేశారు.   

పవన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండలో తిరుగుతూ అలిసి సొలిసి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. కానీ ఈ ఫొటోలను షేర్ చేసిన అకీరా నందన్ ఫేస్ బుక్ ఐడీ నకిలీదని తేలింది. కానీ అభిమానులు పవన్ కొడుకే షేర్ చేశాడని ఎమోషన్ అయ్యి  దీన్ని వైరల్ చేయడం గమనార్హం.  తండ్రి గురించి అకీరా ఇంత బాధపడుతున్నారంటూ అభిమానులు వాపోయారు.

అకీరానందన్ పేరుతో ఫేస్ బుక్ లో నమోదైన పోస్టు తెలుగులో ఉంది. కానీ దాన్ని ఇంగ్లీష్ టు తెలుగులోకి రాసి పోస్టు చేశారు. వాస్తవానికి అకీరానందన్ కు తెలుగు రాదు.. పవన్ భార్య రేణు వారిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతూ పవన్ పిల్లలను పెంచుతోందట.. దీంతో అకీరా నందన్ పేరుతో పవన్ పై చేసిన పోస్టు నకిలీ అకౌంట్ దని తేలింది.
    

Tags:    

Similar News