బుల్లితెరపై మెగాస్టార్ గా వెలుగు వెలిగి క్రియేటివ్ కాన్సెప్ట్ లకు హెడ్ ఆఫ్ ది హెడ్ గా నిలిచిన ఓంకార్ సడన్ గా కనుమరుగైపోయాడు. ఛాలెంజ్ - ఆట వంటి టి.వి షోలతో ఎదుటివాళ్ళు అసూయపడే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఇతడికి ఈ పరిస్థితి ఏంటని బుర్రగోక్కున్నవారెందరో. పైగా వెండితెర ప్రయత్నం జీనియస్ కూడా ఓంకార్ ని బాగా కలవరపెట్టింది. అయితే వీటన్నిటికీ కారణం ఓంకార్ కి దొరికేసిందా?
చూస్తుంటే అవుననే అనాలి. కెరీర్ డౌన్ టైం లో వున్నప్పుడు చాలా మంది సెలెబ్రిటీలు ఫాలో అయ్యే సూత్రమే ఓంకార్ కూడా అలవరుచుకున్నట్టు తెలుస్తుంది. అదే న్యూమరాలజీ. మన పేరులోని అక్షరాలకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉచ్చారణలో తేడా లేకుండా తారా బలంపొందడానికి వీళ్ళు పడే కష్టాలు మనకి కొత్తేమీ కాదు.
ఇప్పుడు ఓంకార్ కూడా ఆంగ్ల వరుసలో తన పేరులో 'హెచ్' అనే అక్షరం మధ్యలో తగిలించుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కొత్తపేరుని తన తాజా చిత్రం 'వాట్ ఈజ్ రాజుగారి గది' సినిమా టైటిల్ కార్డ్స్ లో కూడా కనిపిస్తుంది. మరి ఈ నామమార్పిడి అన్నయ్యకి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.