హర్రర్ సినిమాలంటే ఒక బంగ్లా అందులో కనిపించీ కనిపించని ఆత్మలు, నలుగురు కమెడియన్లు ఇలా ఒక లైన్ లో చాల వరకు సినిమాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు రాజుగారి గది 2 కాస్త కొత్తగా ఉంటుందని దర్శకుడు ఓంకార్ చెబుతున్నాడు. అంతే కాకుండా మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందట. మొన్నటి వరకు హీరోయిన్లు భయపెట్టారు. కానీ సమంత మాత్రం హార్ట్ ని టచ్ చేసే విధంగా కన్నీళ్లు పెట్టిస్తుందని ఓంకార్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఓంకార్ మాట్లాడుతూ.. మొదట రాజు గారి కథ 2ను వేరే విధంగా రాసుకున్నాను. అప్పుడు వెంకటేష్ గారికి వినిపించాను. కానీ ఆయన గురు సినిమాలో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయారు. ఇక ఆ తరువాత పివిపి పరిచయం అవ్వగానే.. వారి సలహా మేరకు నాగార్జున - సమంత ని సెలక్ట్ చేశాను. మలయాళం ‘ప్రేతం’ నుండి సోల్ పాయింట్ ను తీసుకుని కొత్త కథ రాసుకున్నాను. దీంతో నాగార్జున - సమంత సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేశారు. సినిమా కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడిందిలే. ''గ్రాఫిక్స్ కోసం ముంబై వరకు వెళ్లాను. 24 సినిమాకి వాటర్ ఎఫెక్ట్స్ చేసిన యూనిట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ఎక్కువగా ఆ తరహా సన్నివేశాలు ఉంటాయి. అవుట్ ఫుట్ చూశాక నాగార్జున గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో సాగుతూ ఉంటుంది సెకండ్ ఆఫ్ మొత్తం ఎమోషన్స్ తో కూడుకున్న సినిమా'' అని చెప్పాడు ఓంకార్.
ఇక నాగార్జున గారితో విభేదాలు ఏమైనా వచ్చాయా అని అడిగితే.. అలాంటిది ఏమి రాలేదని ఓంకార్ వివరిస్తూ.. ''సినిమా అవుట్ ఫుట్ చూసి ఆయన చాలా సంతోషించారు . సినిమా కథ చెప్పినప్పుడు కూడా.. నువ్వే నా బాస్. నువ్వు ఏది చెబితే అది చేస్తానని చెప్పారు'' అంటున్నాడు ఈ మాజీ యాంకర్. ఇక తన గత సినిమాల్లోలానే ఈ సినిమాలో కూడా ఓకే సోషల్ మెస్సేజ్ ఉంటుందని తెలిపాడు.