తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'. వినూత్నమైన టాక్ షోలతో, వెబ్ సిరీస్ లు, సినిమాలతో వీవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా సెలబ్రిటీ టాక్ షోలతో ఆకట్టుకుంటూ వస్తోంది. తమాషా విత్ హర్ష, సామ్ - జామ్, నెం.1 యారీ (సీజన్ 3), అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె వంటి టాక్ షోలతో మరింతగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ వీవర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్ గా మారి చేసిన సెలబ్రిటీ టాక్ షో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి టాక్ ఆఫ్ ది సెన్సేషన్ అయింది.
ఐఎమ్ డీబీ సైట్ లో టాప్ రేటింగ్ ని సొంతం చేసుకున్న షోగా రికార్డుని కూడా సాధించిన విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో మొదలైన తొలి సీజన్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ తో ఎండ్ చేశారు. ఫస్ట్ సీజన్ కు భారీ స్పందన లభించిన నేపథ్యంలో త్వరలోనే 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' సీజన్ 2 కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సారి మరిన్ని ప్రత్యేకతలతో సీజన్ 2 ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఆహా కోసం ఓంకార్ అన్నయ్యని రంగంలోకి దింపేస్తున్నారు. ఇటీవలే తమన్, నిత్యామీనన్, సింగర్ కార్తీక్ లు న్యాయ నిర్ణేతలుగా, సింగర్ శ్రీరామ చంద్ర యాంకర్ గా సింగర్స్ కోసం 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షోని నిర్వహించిన 'ఆహా' త్వరలో ఓంకార్ తో 'డ్యాన్స్ ఐకాన్' పేరుతో డ్యాన్సింగ్ షోకి శ్రీకారంచుడుతోంది. బుల్లితెరపై ప్రత్యేక షోలతో తనదైన ముద్ర వేశాడు ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత ఓంకార్.
జెమినీ మ్యూజిక్ కోసం వీడియో జాకీగా అంకితం తో తన కెరీర్ ని ప్రారంభించిన ఓంకార్ సెన్సేషనల్ డ్యాన్స్ షో 'ఆట సీజన్ 1'తో క్రియేటర్ గా, ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆట జూనియర్స్ సీజన్ 1 నుంచి 'ఆట జూనియర్స్ 7' వరకు తో ఎంతో మంది కొరియోగ్రాఫర్లని వెలుగులోకి తీసుకొచ్చారు. అలాంటి ఓంకార్ ని 'ఆహా' రంగంలోకి దింపేస్తోంది. ఓంకార్ తో కలిసి ఆహా 'డ్యాన్స్ ఐకాన్' పేరుతో సరికొత్త షోని ప్రారంభించబోతున్నారు.
ప్రతిభా వంతులకు ఆహ్వానం పలుకుతూ ఈ షోని నిర్వహించబోతున్నారు. ఇందు కోసం జూన్ 22 నుంచి ఆడిషన్స్ ని ప్రారంభించారు. 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య వున్న వాళ్లకు ఈ షోలో అవకాశం కల్పించబోతున్నారట.
ఈ షో చాలా డిఫరెంట్ గా వుంటుందని, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే డ్యాన్స్ మాస్టర్ల జీవితాల్ని ఈ షో మార్చబోతోందని, ఈ షొ ఫైనల్ లో గెలిచి విజేతగా నిలిచే కంటెస్టెంట్ కు పెద్ద హీరోకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని కల్పించనున్నారట. ఆ హీరో ఎవరన్నది ఫినాలేలో చెబుతామని ఆహా వర్గాలు తెలిపాయి. గత షోల తరహాలోనే 'డ్యాన్స్ ఐకాన్' షో కూడా ఆహాలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారంటీ అని చెబుతున్నారు.