అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''పుష్ప: ది రైజ్''. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనున్న సంగతి తెలిసిందే. 'ఊ అంటావా.. ఊఊ అంటావా' అనే పాటలో క్వీన్ సామ్ డ్యాన్స్ మూవ్స్ తో ఈ వింటర్ హీటెక్కబోతోందని చిత్ర బృందం ఐటమ్ నంబర్ మీద అంచనాలు ఆసక్తిని కలిగించింది.
ఈ నేపథ్యంలో తాజాగా 'ఊ అంటావా.. ఊ ఊ అంటావా' పాట లిరికల్ వీడియోను 'పుష్ప' మేకర్స్ విడుదల చేశారు. 'కోకా కోకా కోకా కడితే కొర కొరమంటూ చూస్తారు.. పొట్టి పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు.. కోకా కాదు గౌను కాదు.. కట్టు లోనా ఏముంది..'అంటూ సాగిన ఈ పాట మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ లో ఆడిపాడుతున్న సమంత.. పొట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ అందాలతో హీట్ పెంచేస్తోంది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో తనకు సాటిలేరని మరోసారి నిరూపించారు. తెలుగులో ఈ ఐటమ్ నంబర్ కు గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. గాయని ఇంద్రవతి చౌహన్ హుషారుగా ఆలపించారు. తమిళంలో సింగర్ కమ్ హీరోయిన్ ఆండ్రియా.. కన్నడలో తెలుగమ్మాయి మంగ్లీ.. మలయాళంలో రమ్యా నంబీశన్ ఈ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.
స్పెషల్ సెట్ లో షూట్ చేయబడిన 'ఊ అంటావా.. ఊ ఊ అంటావా' పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. విజయ్ - భాను మాస్టర్స్ కూడా ఇందులో భాగం అయ్యారు. లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ - సమంతల స్టెప్పులు చూపించనప్పటికీ.. ఇందులో డ్యాన్స్ స్పెషల్ గా ఉంటుందని అర్థం అవుతోంది. బన్నీ - సుక్కూ - దేవిశ్రీ కలయికలో ఇంతకముందు వచ్చిన 'అ అంటే అమలాపురం' 'రింగ రంగ' తరహాలోనే 'ఊ అంటావా' పాట కూడా కొన్నాళ్ల పాటు మాస్ ప్రేక్షకులను ఊపేయనుంది.
'పుష్ప' చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనర్ గా వ్యవహరించారు. ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ - అజయ్ ఘోష్ - అజయ్ - శత్రు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. 'పుష్ప: ది రైజ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది.
Full View