మిగతా స్టార్ కథానాయకుల సినిమాలకీ, నాగార్జున సినిమాలకీ మధ్య చాలా వ్యత్యాసముంటుంది. నాగార్జున సినిమాలు ఓపెనింగ్స్ పై ఆధారపడవు. హిట్ టాక్ వచ్చాక ఆ తర్వాతే థియేటర్లలో కుదురుకుంటుంటాయి. నెలల తరబడి వసూళ్లు సాధిస్తుంటాయి. మొన్న విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా విషయంలోనూ అదే జరిగింది. సంక్రాంతికొచ్చిన అన్నిసినిమాలూ రెండు వారాల్లో చతికిలపడిపోయాయి. కానీ సోగ్గాడే... మాత్రం నెల రోజులపాటు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని అలరించింది. అందుకే ఆ చిత్రం భారీ స్థాయి విజయాన్ని చేజిక్కించుకొంది.
అయితే ఇటీవల విడుదలైన ఊపిరి సినిమా మాత్రం ఓపెనింగ్స్ పరంగా కూడా కుమ్మేస్తోంది. కార్తీ తోడైన ఎఫెక్టో మరేంటో తెలియదు కానీ... తొలి రోజే సినిమాకి 11కోట్ల మేర వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. కార్తీ తమిళ కథానాయకుడే అయినా.. ఆయనకీ తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇతర స్టార్ కథానాయకుల సినిమాల్లాగే కార్తీ సినిమాలకీ తెలుగులో భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. శుక్రవారం విడుదలైన ఊపిరి విషయంలోనూ అదే జరుగుతోంది. దానికి తోడు నాగ్ కూడా `మనం` - `సోగ్గాడే చిన్నినాయన`లతో వరుసగా విజయాల్ని సొంతం చేసుకొని ఊపుమీదున్నాడు. ఇలా అన్నీ కలిసిరావడం మూలంగానో మరేంటో కానీ... తెలుగు వెర్షన్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. శుక్రవారం - శనివారం రెండు రోజులూ వసూళ్లు అదిరిపోయాయి. మరోపక్క ఓవర్సీస్ లోనూ మిలియన్ మార్క్ సినిమా అంటున్నారు. తమిళంలోనే సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ప్రాఫిటబులే అని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. పైగా రాబోయే వారం రెండు వారాల్లో పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి ఊపిరికి వసూళ్లు స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి.