సౌత్ సినిమా అజేయంగా దూసుకెళుతోంది. ఇన్నాళ్లు భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అని.. పెద్దన్న నేనే అని చెప్పుకున్న బాలీవుడ్ కి.. ధీటైన సమాధానం చెబుతూ తెలుగు చిత్రపరిశ్రమ సత్తా చాటుతోంది. వరుసగా పాన్ ఇండియా విజయాలతో 2022 ఆద్యంతం టాలీవుడ్ దండయాత్ర అజేయంగా కొనసాగింది. RRR తో టాలీవుడ్ కీర్తి ప్రపంచస్థాయికి విస్తరించింది. బాహుబలి దర్శకుడు రాజమౌళి అండతో మన స్టార్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. వరల్డ్ వైడ్ అవార్డు వేడుకల్లో ఆర్.ఆర్.ఆర్ తళుక్కుమంటోంది. మన స్టార్ల కీర్తి వినువీధుల్లోకి విస్తరించింది.
తెలుగు సినిమా ఈ స్థాయికి ఎదగడంపై మీ వ్యూ ఏమిటీ? అని మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆయన ఎంతో ఎగ్జయిటింగ్ గా స్పందించారు. "అంతర్జాతీయంగాను వావ్ అనిపించే స్థాయికి మనం ఎదిగాం. మన సినిమా ఆస్థాయికి వెళ్లడానికి కారణం శంకర్ - రాజమౌళి అని ఆ ఇద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్థావించారు. కన్నడ రంగం నుంచి కేజీఎఫ్ కూడా అద్భుతం చేసిందని కితాబిచ్చారు. నేను సౌత్ సినిమాని కింది స్థాయినుంచి చూసాను. ఇంత పెద్ద స్థాయిని కూడా చూస్తున్నాను. గర్వపడే సందర్భమిదని చిరు అన్నారు.
ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ లో ఆర్.ఆర్.ఆర్ పురస్కారాల్ని దక్కించుకోవడం తనను ఎంతో ఎగ్జయిట్ చేసిందని అన్నారు. మరకతమణి ఎం.ఎం.కీరవాణి నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అందుకోవడాన్ని ఆయన మనస్ఫూర్తిగా స్వగతిస్తూ అభినందనలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ వరకూ వెళ్లాం.. ఆస్కార్ ఇంకో మెట్టు మాత్రమేనని చిరంజీవి ధీమాను కనబరిచారు. ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ అందుకోవాలని ఆకాంక్షిస్తూ రామౌళి అండ్ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. రాజమౌళి- తారక్ - చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. అలాగే కింగ్ ఖాన్ షారూఖ్.. ఆర్.ఆర్.ఆర్ గోల్డెన్ గ్లోబ్ పురస్కారం గురించి ఎగ్జయిట్ అవుతూ.. ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ గెలుచుకుంటే తనను ఒకసారి దానిని తాకనిస్తారా? అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై టీవీ యాంకర్ ప్రశ్నకు చిరంజీవి ఎంతో ఉద్వేగానికి గురవుతూ .. అంత పెద్ద స్టార్ అలా స్పందించారంటే మన తెలుగు చిత్రసీమ ఎంత పెద్ద స్థాయికి ఎదిగిందో అర్తం చేసుకోవచ్చని ఆస్కార్ అనే ఇంకో మెట్టు ఎక్కాలని వ్యాఖ్యానించారు.
154 సినిమాలు చేసినా కానీ.. ఇప్పటికీ తన తొలి సినిమా ప్రాణం ఖరీదులో హీరోలా ఫీలయిపోతాను అని... నిత్యవిద్యార్థిలా.. ఉండటాన్ని ఇష్టపడతానని చిరు వినమ్రంగా తెలిపారు. సెట్స్ లో పైకి ఉత్సాహం కనిపించినా కానీ లోన టెన్షన్ పడుతూ ఉంటాను... మేకప్ రూమ్ నుంచి సెట్లో సీన్ చేసే వరకూ ప్రొడక్టివ్ టెన్షన్ తో ఉంటాను. శ్రుతిహాసన్ లాగా రేసుగుర్రంలో ఉన్నట్టు ఉండొచ్చేమో కానీ..
ఈరోజుకీ నాకు టెన్షన్ ఉందని చిరంజీవి అంగీకరించారు. దానివల్ల సినిమాకి చాలా మంచి జరుగుతుంది. మంచి ఔట్ పుట్ వస్తుందని కూడా తనలో దాగి ఉండే టెన్షన్ గురించి 60 ప్లస్ నటుడు చిరంజీవి 45 ఏళ్ల అనుభవం ఉన్న చిరంజీవి చెప్పారంటే సినిమాల విషయంలో ఆయన కమిట్ మెంట్ ని అర్థం చేసుకోవాలి. పునాది రాళ్లు- ప్రాణం ఖరీదు.. చిత్రాలతో కెరీర్ మొదలైంది. నేడు 154 సినిమాల రారాజు. ఇప్పటికీ ఉరకలెత్తే ఉత్సాహంతో ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.