అలాంటి వారికి వరంగా మారిన ఓటీటీలు..!

Update: 2021-01-29 02:30 GMT
డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ సినిమాల విడుదలకు ప్రత్యామ్నాయ వేదికలుగా మారాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో అనేక చిన్న పెద్ద మీడియం రేంజ్ సినిమాలు డిజిటల్ రిలీజ్ అయ్యాయి. విడుదలకు నోచుకోని సినిమాలకు.. ఎలాగైనా ప్లాప్ అవుతాయి అనుకునే సినిమాలకు ఓటీటీలు వరంగా మారాయి. ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయనే ధైర్యంతో మేకర్స్ అందరూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా చేస్తే చాలు ఓటీటీకి అమ్మేయ‌వ‌చ్చనే భావ‌న ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో బాగా ఎక్కువైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అందుకే డిజాస్టర్ పొజీషన్ లో ఉన్న దర్శకులకు నటీనటులకు హీరోలకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఒక్కొక్కరు నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కొన్ని నిర్మాణ సంస్థలు అయితే హీరోలు దొరక్క కాస్త క్రేజ్ ఉన్నా సరే వారితో సినిమాలు చేయడానికి రెడీగా ఉంటున్నాయి. ఎలాగూ ఓటీటీలు ఉన్నాయనే ధైర్యమే వీరిని ముందుకు నడిపిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఓ ప్లాప్ సినిమాని రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థలు ఇప్పుడు అంతగా క్రేజ్ లేని హీరోలతో మూడు సినిమాలు లైన్ లో పెట్టింది. ఇలా టాలీవుడ్ లో చాలా ప్రొడక్షన్ హౌసెస్ ముందు ఏదొక విధంగా సినిమా కంప్లీట్ చేసేస్తే చాలు.. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది.



Tags:    

Similar News