టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోలంతా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. కేవలం తెర మీద కనిపించడమే కాకుండా.. తెర వెనుక కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధిస్తున్నారు. ముఖ్యంగా సినిమా నిర్మాణంలో అవగాహన కలిగి ఉంటున్నారు. నటించడమే కాదు.. కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు.
వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న వేషాలతో అలరించి.. ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికన్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు పూర్తి చేసిన శేష్.. తన సినిమాలకు కథ - స్క్రీన్ ప్లే రాసుకుంటుంటాడు. ఈ విధంగానే 'క్షణం' 'గూఢచారి' 'ఎవరు' వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇటీవల 'మేజర్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'గూఢచారి 2' కోసం కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు శేష్.
'వెళ్లిపోమాకే' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన విశ్వక్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. 'ఫలక్ నుమా దాస్' సినిమాతో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'ధమ్కీ' అనే సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. 'ఫలక్ నుమా దాస్' సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశ్వక్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా నటించడమే కాదు.. తన హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ కేవలం నటుడుగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గుంటూరు టాకీస్' 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సిద్ధు.. 'డీజే టిల్లు' వంటి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీనికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు సిద్ధునే రాసుకున్నాడు. ఇప్పుడు 'డీజే టిల్లు 2' చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నాడు. 'రాజావారు రాణిగారు' 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' వంటి చిత్రాల్లో నటించడమే కాదు.. కథ - డైలాగ్స్ అందించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'నేను మీకు కావాల్సిన వాడిని' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.
యువ హీరో నాగశౌర్య తాను నటించే సినిమాలకు ఇన్ ఫుట్స్ ఇవ్వడమే కాదు.. ప్రొడ్యూసర్ గానూ రాణిస్తున్నాడు. 'అశ్వద్ధామ' సినిమాకు శౌర్య స్వయంగా కథ రాసుకున్నాడు. అలానే నవీన్ పొలిశెట్టి కూడా తన సినిమాల స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడికి సపోర్ట్ గా నిలుస్తుంటారు. ఈ విధంగానే 'ఏజెంట్ ఆత్రేయ' 'జాతిరత్నాలు' వంటి హిట్లు అందుకున్నాడు.
ఇలా టాలీవుడ్ లో చాలామంది యువ హీరోలు స్క్రిప్ట్ - స్క్రీన్ ప్లేలో ప్రత్యక్షంగా పాల్గొని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. కాకపోతే అన్ని సందర్భాల్లో హీరోల ఇన్ పుట్‌లు వర్కౌట్ అవుతాయని అనుకోలేం. ఇందులో ప్లాప్స్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. దర్శకుడి క్రియేటివిటీకి అడ్డం పడకుండా ఉన్నంత వరకూ ఏది చేసినా నడుస్తుంది. అలా కాకుండా ఇతర విషయాల్లో తలదూర్చడం మూలంగా అది దర్శకుల కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.