ఏంటి బాబూ ఈ ఆక్సిజన్‌??

Update: 2016-04-28 14:01 GMT
అయితే మన సినిమాల్లో అస్సలు కథ అనేదే ఉండట్లేదు. లేకపోతే ఏదైనా కథను కూరిస్తే అది మన ప్రేక్షకులకు అర్ధం కావట్లేదు. అలా తగలడింది మన సినిమాల దుస్థితి. అప్పుడప్పుడూ కొన్ని మాంచి మీనింగ్‌ ఫుల్‌ కథలతో సినిమాలు వస్తున్నా కూడా.. మనోళ్లు ఫారిన్‌ కాన్సెప్టులను కూనీ చేసి మరీ ఇక్కడ తీసేస్తే అవి వర్కవుట్‌ కావట్లేదు.

ప్రస్తుతం శృతి హాసన్‌ రిలీజ్‌ చేసిన ''ఆక్సిజన్‌'' సినిమా మోషన్‌ పోస్టర్‌ చూస్తే మాత్రం ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. అదేదో రెసిడెంట్‌ ఈవిల్‌ వంటి సినిమాల తరహాలో హైదరాబాద్‌ అంతా కాలి తగలబడుతుంటే.. ఆ బ్యాక్ డ్రాప్‌ లో మన హీరో గోపిచంద్‌.. ఒక కార్‌ మీదకు దూకడం.. కార్‌ అద్దాలన్నీ మన ఫ్యాక్షన్‌ సినిమాల్లో టాటూ సూమో అద్దాల్లా ముక్కలవ్వడం.. పక్కనే ఉన్న గూండాలు ఆ అదురుకు ఎగిరి పడటం.. ఇదండీ ఆ మోషన్‌ పోస్టర్‌ తీరు. అసలు దీనిని ఎటువంటి సినిమా అనుకోవాలయ్యా ఏ.ఎమ్‌.జ్యోతికృష్ణా??

దీనిని సోషియో ఫ్యాంటసీ కమ్‌ సోషల్‌ మెసేజ్‌ సినిమా అనాలా.. లేకపోతే సైన్స్‌ ఫిక్షన్‌ లో సీమ ఫ్యాక్షన్‌ సినిమా అనుకోవాలా? కంప్లీట్‌ డిస్‌ కనెక్టడ్‌ గా ఉన్నా.. ఏదో కొత్త కథను మనకు నెరేట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాడీ దర్శకుడు. చూద్దాం ఎలా ఉండబోతుందో మరి.
Full View


Tags:    

Similar News