హీరోలు మరియు హీరోయిన్స్ ఫిజిక్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాస్త బరువు ఎక్కువ అయితే ఆఫర్లు తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బరువు తగ్గినా కూడా గ్లామర్ పోయింది అంటూ ట్రోల్స్ వస్తాయి. కనుక హీరో హీరోయిన్ లు ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు సినిమాల్లో పాత్రకు తగ్గట్లుగా ఫిజిక్ తో కనిపించేందుకు వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈమద్య గ్రాఫిక్స్ వచ్చింది కనుక పెద్ద హీరోల సినిమాలకు కాస్త ఎక్కువ ఖర్చు అయినా ఆ మార్పులు గ్రాఫిక్స్ ద్వారా చేస్తున్నారు. కాని చిన్న హీరోల సినిమాలకు మాత్రం కొన్ని కష్టాలు తప్పవు. ముఖ్యంగా సన్నగా ఉన్న హీరో లేదా హీరోయిన్ కాస్త బొద్దుగా కనిపించాలంటే డ్రస్ లోపల ప్యాడ్స్ పెడుతూ ఉంటారు. ఆ పద్దతి చాలా కాలంగా వస్తుంది.
తెలుగు లో గాలిపటం సినిమాలో నటించి టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎరికా ఫెర్నాండెజ్ ఆ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు తో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా సినిమాలు చేసిన ఈ అమ్మడు కాస్త సన్నగా ఉంటుంది. దాంతో ఒక సౌత్ సినిమా షూటింగ్ సమయంలో డ్రస్ లో ప్యాడ్స్ పెట్టి ఆమె లావుగా కనిపించేలా మేకర్స్ చేశారట. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కూడా అదే పద్దతిని పాటించారట. ఆ సమయంలో చాలా ఇబ్బంది గా ఎరికా ఫీల్ అయ్యేదట. కాని సినిమా కోసం తప్పదు కదా అని భరించేదట. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో అలా ఫ్యాడ్స్ పెడుతూ ఉంటే తన లో లోపం ఉందని బాధపడేదాన్ని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. డ్రస్ లోపల ప్యాడ్స్ పెట్టుకుని నటించే సమయంలో చాలా ఇబ్బందిగా ఉండటం మాత్రమే కాకుండా అంత మంది ముందు అలా నటించేందుకు సిగ్గుగా అనిపించేది. కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు.. అదృష్టం కొద్ది సందర్బాలు మళ్లీ రాలేదు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు.. ముఖ్యంగా కొత్త వారు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోయిన్స్ కు లేవని అంది. అంటే కాస్టింగ్ కౌచ్ కాని ఇతర లైంగిక వేదింపులు కాని కొత్త వారికి ఎక్కువ లేవు అనేది ఆమె అభిప్రాయం.