వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకుంటున్న సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ.. ఇప్పుడు మరో కాంట్రవర్సీకి కారణమయ్యాడు. జూన్ లో ఉడ్తాపంజాబ్ మూవీ విషయంలో చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా సెన్సార్ బోర్డ్ పరువు తీసేసినా.. ఇంకా ఈయన తీరు మాత్రం మారలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సెన్సార్ చీఫ్ గా కాకుండా.. పర్సనల్ గా ఓ కామెంట్ చేసి.. అగ్గి రగిలించాడు.
రీసెంట్ గా ఈయన దగ్గరకు 'ఎ ఫ్లయింగ్ జాట్' మూవీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన పహ్లాజ్ కు బాగా నచ్చేసిందో.. ఏదైనా తేడా ఫీలింగ్ వచ్చిందో తెలీదు కానీ.. విచిత్రంగా ఓ ట్వీట్ పెట్టాడు. 1975 లో వచ్చిన 'జై సంతోషి మా' అనే చిత్రంతో పోలిక పెడుతూ.. ఆ సినిమాలా ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నాడు. ఈయన కామెంట్ ను పాజిటివ్ గా చేశాడో.. నెగిటివ్ గానే పోస్ట్ చేశాడో చెప్పలేం కానీ.. నెట్ జనాలతో పాటు సినమా మేకర్స్ కి కూడా బాగా మండించేసింది.
ఎప్పటిదో 40 ఏళ్ల క్రితం నాటి సినిమాతో పోల్చడం బాగా వెటకారం అంటున్నరు జనాలు. టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ మూవీపై అప్పుడే అనుమానాలు మొదలపోయాయి.