గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. గీతా ఆర్ట్స్ - యూవీ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. సత్యరాజ్ .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు.
జులై 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా మారుతి .. గోపీచంద్ .. రాశి ఖన్నాలను బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు.
ఈ షోలో మారుతి మాట్లాడుతూ .. "ఈ కథను రాసుకున్న తరువాత గోపీచంద్ గారిని కలుసుకోవడం జరిగింది. అంతేగానీ గోపీచంద్ గారిని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ కాదు. ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో కామెడీ ఉంది. కానీ ఈ సినిమాలో దాని వాటా ఎక్కువగా ఉంటుంది.
గీతా ఆర్ట్స్ వారితోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం వాళ్లు నన్ను గుత్తాకి తీసుకోవడమే. అందువల్లనే వాళ్లతో కలిసి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను. ఇక యూవీ వాళ్లు కూడా నాకు మంచి ఫ్రెండ్సే. థియేటర్లు కళకళలాడాలనే ఉద్దేశంతోనే టిక్కెట్ల రేట్లు అందుబాటులో ఉంచాము" అని చెప్పాడు.
గోపీచంద్ మాట్లాడుతూ .. "నా సినిమాల్లో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో ఆ యాక్షన్ అనేది కామెడీని కలుపుకుని నడుస్తుంది. ఇంతకుముందు చేసిన 'రణం' .. 'లౌక్యం' తరహాలో ఈ సినిమా ఉంటుంది. నా హీరోయిజం ఎంతమాత్రం తగ్గకుండా కామెడీ ఉంటుంది .. అదీ కొత్తగా ఉంటుంది. నా సినిమాల టైటిల్స్ విషయంలో నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. గతంలో కొన్ని టైటిల్స్ విషయంలో అలా జరగడం వలన అలా అనుకున్నారంతే" అని అన్నారు.
ఒక రాశి ఖన్నా మాట్లాడుతూ .. "చాలా కాలం తరువాత మళ్లీ ఒక మంచి పాత్ర దొరికింది. ఈ పాత్ర నాకు బాగా నచ్చింది .. ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. నా పెళ్లి విషయానికి వస్తే అది దేవుడి చేతిలో ఉంది. పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చింది. రాశి ఖన్నాను చూసి బిత్తిరి సత్తి సిగ్గుపడటం .. 'అందాలరాశి పాటను తన స్లాంగ్ లో పాడటం .. రాశి డైలాగ్ కి తన స్టైల్లో ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం నవ్విస్తుంది. బిత్తిరి సత్తి స్లాంగ్ అర్థంకాక రాశి ఖన్నా అయోమయానికి లోను కావడం అదనపు నవ్వులను మూటగట్టి ముందు పెడుతుంది.
Full View