మేలో 'స‌లార్' ట్రిట్..ఫ్యాన్స్ కి పూన‌కాలే!

Update: 2022-04-14 11:34 GMT
పాన్ ఇండియా  చిత్రం `ఆర్ ఆర్ ఆర్` హంగామా దాదాపు పూర్త‌యిన‌ట్లే. నేటి నుంచి మ‌రో పాన్ ఇండియా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `కేజీఎఫ్-2` అభిమానుల‌కు థియేట‌ర్లో ట్రీట్ ఇస్తుంది. యాక్ష‌న్ ఎలివేష‌న్స్ అదిరిపోయాయ‌ని టాక్ వినిపిస్తోంది. `కేజీఎఫ్` ఫ్యాన్స్ కి  ఇది బిగ్ ట్రీట్ అనే అంటున్నారు. అదే స‌మ‌యంలో క‌థ‌కి ఏమాత్రం స్కోప్ లేకుండా ఎలివేషన్స్ పైనే దృష్టి పెట్టార‌ని నెగిటివ్ టాక్ వినిపిస్తుంది.

ఈ విష‌యంలో స్టార్ మేక‌ర్  ప్ర‌శాంత్ నీల్ వైఫ‌ల్యం చెందాడ‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే పాన్ ఇండియా కేట‌గిరిలో గ‌త మూడేళ్ల‌గా ఈ రెండు చిత్రాల‌తో పాటు..`స‌లార్` అనే మ‌రో ప్రాజెక్ట్ కూడా హీటెక్కిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. రెబల్  స్టార్ ప్ర‌భాస్ హీరోగా `కేజీఎఫ్` ఫేం ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్  పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్  అయిన ప్ర‌భాస్ ఫ‌స్ట్  లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది.

అయితే ఇప్పుడా ఆ అంచ‌నాలు రెట్టింపు చేయడానికి అంత‌కు మించి ట్రీట్ ఇవ్వ‌డానికి ఆ ద్వ‌యం రెడీ అవుతోంది. వ‌చ్చే నెల‌ఖ‌రులో `స‌లార్` టీజ‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో ఈ విష‌యం  నెట్టింట వైర‌ల్ గామారింది.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ స‌హా `కేజీఎఫ్` ఫ్యాన్స్ లో అప్పుడే  క్యూరియాసిటీ మొద‌లైంది. `ఉయ్ ఆర్ రెడీ` అంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఫిలిం క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ కూడా ట్విట‌ర్ వేదిక‌గా షేర్ చేసారు.

ఇప్ప‌టికే `స‌లార్` స‌గం షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ పూర్తి చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే స‌లార్ టీమ్ మ‌ళ్లీ షూటింగ్లో బిజీ కానుంది. ప్ర‌భాస్ రాధేశ్యామ్ రిలీజ్ నేప‌థ్యంలో అప్పుడు ఆ సినిమా ప్ర‌మోష‌న్ లో బిజీ అవ్వ‌డం..అటుపై ప్ర‌శాంత్ నీల్ `కేజీఎఫ్-2` ప్ర‌చారంలో  బిజీ అవ్వ‌డంతో `స‌లార్` తాత్కాలికంగా షూటింగ్ నిలిచిపోయింది.

నేడు `కేజీఫ్-2` రిలీజ్ అయింది కాబ‌ట్టి ప్ర‌శాంత్  మ‌రో వారం రోజుల్లో ఫ్రీ అయిపోతారు. అటుపై `స‌లార్` బ్యాలెన్స్ షూట్ మొద‌లవుతుంది. ఇందులో ప్ర‌భాస్ కి జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. ఈచిత్రాన్ని హంబోలే ఫిల్మ్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ప్ర‌భాస్ గ‌త రెండు చిత్రాలు `సాహో`..`రాధేశ్యామ్` పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అయి అంచ‌నాలు అందుకోవ‌డంలో  విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News