ప్రముఖ డిజిటల్ వేదిక ZEE5 తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి పలు భాషల్లో నిర్విరామంగా కంటెంట్ ను అందిస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందించడానికి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు పెడుతోంది.
ఇటీవల 'రెక్కీ' 'మా నీళ్ళ ట్యాంక్' వంటి రెండు వెబ్ సిరీస్ లను అందించిన జీ5.. ఇప్పుడు ''పేపర్ రాకెట్'' పేరుతో మరో కొత్త సిరీస్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోడలు కిరుతిగ ఉదయనిధి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్ లో శ్రీనిధి సాగర్ నిర్మించారు.
''పేపర్ రాకెట్'' లో కాళిదాస్ జయరామ్ మరియు తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రలలో నటించారు. రేణుక - కరుణాకరన్ - నిర్మల్ పలాజి - గౌరీ కిషన్ - ధీరజ్ - నాగినీడు - చిన్ని జయంత్ - కాళీ వెంకట్ - పూర్ణిమ భాగ్యరాజ్ - జి.ఎం.కుమార్ - అభిషేక్ శంకర్ - ప్రియదర్శిని రాజ్ కుమార్ - సుజాత తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
'పేపర్ రాకెట్' అనేది మంచి ఫీల్ గుడ్ సిరీస్ అని.. హృదయాన్ని కదిలించే కథను చెబుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్ జూలై 29 నుండి ZEE5లో తెలుగు తమిళ భాషల్లో ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ అక్కినేని నాగార్జున ట్రైలర్ లాంచ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ట్రైలర్ విషయానికొస్తే.. ఆరుగురు అపరిచితులు తమ వ్యక్తిగత సవాళ్లకు ముగింపు పలకడం కోసం ఓ రోడ్ ట్రిప్ ను ప్లాన్ చేసుకున్నారు. రోడ్ ట్రిప్ సమయంలో వారిలో ప్రతి ఒక్కరు తమ బకెట్ లిస్ట్ లోని ఒక ప్రధాన కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆ జర్నీ అంత సాఫీగా సాగినట్లు కనిపించడం లేదు.
ఆ ఆరుగురి కోరికలను తీర్చడంలో కథానాయకుడు జీవా (కాళిదాస్ జయరామ్) ఎలా సహాయం చేస్తాడు? అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. 'పేపర్ రాకెట్' జీవితం పట్ల తాత్విక దృక్పథాన్ని మరియు జీవితంలోని ప్రతి అంశంలో ఆనందాన్ని కనుగొనే మానవ భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. సైమన్ కె కింగ్ ఈ సిరీస్ కు సంగీతం సమకూర్చగా.. రిచర్డ్ ఎం నాథన్ & గావెమిక్ యు ఆరీ సినిమాటోగ్రఫీ అందించారు.
'పేపర్ రాకెట్' ట్రైలర్ రిలీజ్ తర్వాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. "ఇది హృదయాన్ని ఆకట్టుకునేలా ఉంది. మీరు ఖచ్చితంగా ఇష్టపడే అనేక భావోద్వేగాలతో నిండి ఉంది'' అని అన్నారు. ఈ సందర్భంగా పేపర్ రాకెట్ ను వదిలి టీమ్ కు బెస్ట్ విషెస్ అందజేశారు.
హీరో కాళిదాస్ జయరామ్ మాట్లాడుతూ.. ''పేపర్ రాకెట్ ట్రైలర్ ను విడుదల చేసిన అక్కినేని నాగార్జున గారికి ధన్యవాదాలు. అతని హృదయపూర్వక ప్రశంసలు విని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సిరీస్ లో నటిస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ ను తప్పకుండా చూడాలి. ఇది అందరికీ మంచి అనుభూతిని కలిగిస్తుంది'' అని అన్నారు.
డైరెక్టర్ కిరుతిగ ఉదయనిధి మాట్లాడుతూ.. ''పేపర్ రాకెట్ చాలా ప్రత్యేకమైనది.. నా మనసుకు దగ్గరైంది. నటీనటులు తమ అద్భుతమైన నటనతో స్క్రిప్ట్ లోని ఇంటెన్సిటీని పెంచారు. సాంకేతిక నిపుణులు తమ నిష్కళంకమైన సహకారాన్ని అందించారు. ఈ సిరీస్ లో సౌండ్ డిజైన్ ప్రముఖ పాత్ర పోషించింది. 'పేపర్ రాకెట్' ని విస్తృతంగా విడుదల చేస్తున్నందుకు ZEE5కి ధన్యవాదాలు''అని అన్నారు.
Full View