అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయడమంటే.. ఏ డైరెక్టర్ కి అయినా ఓ లైఫ్ టైం టార్గెట్ లాంటిదే. అంత తేలిగ్గా అవకాశం రాదు. వచ్చిన ఛాన్స్ ను వేస్ట్ చేసుకున్న డైరెక్టర్లు కూడా అరుదుగా కనిపిస్తారు. బ్యానర్ వాల్యూతోనే సినిమాని సగం హిట్ చేసేయగల స్టామినా అల్లు అరవింద్ కి.. గీతా ఆర్ట్స్ కి ఉంది.
ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన శ్రీరస్తు శుభమస్తుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అల్లు శిరీష్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి సినీ పండిట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా దర్శకుడు పరశురామ్ కి చాలానే సంతోషాన్నిస్తోంది. అయితే.. గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే అల్లు అరవింద్, హీరోలు ఇన్వాల్వ్ అయిపోతారనే మాటను ఖండించాడు ఈ దర్శకుడు.
'నా దగ్గర ఉన్న అన్ని సినిమాలు అల్లు అరవింద్ కి తెలుసు. తర్వాతి సినిమా కూడా గీతా ఆర్ట్స్ పైనే చేయబోతున్నా' అని చెప్పాడంటే.. ఎంతగా ఆ మెగా ప్రొడ్యూసర్ ని మెప్పించాడో అర్ధమవుతుంది. గీతా ఆర్ట్స్ లో సినిమా అన్నాడు కానీ.. హీరో ఎవరో చెప్పకుండా తప్పించుకున్నాడీ డైరెక్టర్. శిరిష్ కి హిట్ ఇస్తే.. సాధారణంగా మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ లెవెల్ హీరోలతో ఛాన్స్ వస్తుందంటారు. ఆ లెక్క ప్రకారం తన మరుసటి సినిమా కూడా మెగా హీరోతోనే చేయనున్నాడన్న మాట. మరి ఈ టాక్ లో వాస్తవమెంతో పరశురాం నెక్ట్స్ ప్రాజెక్ట్ ను చూసి అర్ధం చేసుకోవాలి.