ఈ ఏడాది వచ్చిన ఇండస్ట్రీ హిట్స్ లో టాప్ 3లో నిలిచిపోయిన గీత గోవిందం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కూల్ లవ్ స్టొరీగా విడుదలై ఏకంగా 70 కోట్ల దాకా షేర్ రాబట్టి ఇతర బాషల రీమేక్ హక్కుల కోసం క్యు కట్టేలా చేయడం దీనికే సాధ్యమయ్యింది. అర్జున్ రెడ్డితో సాధించుకున్న ఇమేజ్ ని మరోరకంగా మేకోవర్ చేసుకుని తన రేంజ్ ని అమాంతం పెంచేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక దర్శకుడిగా పరశురాం డిమాండ్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గీత గోవిందం విడుదల కావడం ఆలస్యం మేం అడ్వాన్స్ ఇచ్చాడంటే మేమిచ్చాం అంటూ రెండు మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రకటనలు గుప్పించడం కొంత అయోమయం రేపింది కూడా.
అయితే గీత ఆర్ట్స్ 2లోనే పరశురామ్ నెక్స్ట్ మూవీ ఉంటుందని బన్నీ వాస్ చెప్పడంతో వాటికైతే చెక్ పడింది. ఇప్పుడు అసలైన మరో చిక్కు వచ్చి పడిందట. పరశురాం అయితే రెడీ ఉన్నాడు కాని సరైన హీరో దొరక్క ఆలస్యమవుతోందని ఇన్ సైడ్ టాక్. తనదగ్గర ఐదారు కథలు ఉన్నాయని గతంలోనే చెప్పాడు కాని హీరో లేక ఇంకా లేట్ అవ్వొచ్చు అనే మాట వినిపిస్తోంది. పరశురాం గీత గోవిందం తెచ్చిన పేరుని నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఒక్క నిర్ణయం మొత్తం తలకిందులు చేస్తుంది.
సాయి ధరమ్ తేజ్ తో చేయొచ్చు అనే టాక్ వినిపించింది కానీ తేజు చిత్రలహరిలో బిజీ అయిపోయాడు. సో ఇప్పటికిప్పుడు పరశురామ్ కు రైట్ ఆప్షన్ దొరక్కపోవచ్చు. విజయంవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్న గీత గోవిందం ఇటీవలే శాటిలైట్ లో ప్రసారమైనప్పుడు టిఆర్పి రేటింగ్స్ ప్రకారం రికార్డు సృష్టించడం విశేషం