గ్లామర్లందు రకుల్ గ్లామర్ వేరయా!!

Update: 2016-12-05 04:26 GMT
స్టార్ హీరోయిన్లందరూ దాదాపు గ్లామర్ అనే పదానికి పర్యాయ పదంగా ఉంటారు. అయితే వీరందరిలోకి కొందరి గ్లామర్ తారాస్థాయిలో ఉంటుంది. బికినీ టాప్ లో.. నడుం అందాలనూ నాభి సోయగాలనూ దారబోస్తూ.. అలా బురదలో రకుల్ దొర్లుతుంటే.. వామ్మోయ్ ఇక్కడ టెంపరేచర్లు రచ్చ మ్యాక్స్ కు వెళిపోతున్నాయ్. ఇంతకీ ఈ గ్లామరానందం అంతా దేని గురించి అనేగా? పదండి చూద్దాం.

ఇప్పటికే పలు సినిమాల్లో పలుమార్లు ఓ రేంజులో గ్లామర్ ను భారీగానే ఆరబోసింది రకుల్ ప్రీత్. ఆ విధంగా తక్కువ టైములో ఆమె సెన్సేషనల్ స్టార్ హీరోయిన్ కూడా అయిపోయింది. మొహమాటం లేకుండా సమంత టైపులో సోకులు చిందించే భామ ఎవరూ అంటే.. అందరూ ముందు రకుల్ పేరే చెబుతారు. ఇక ''ధృవ'' సినిమా కోసం అమ్మడు 'పరేషానురా' అనే పాటలో తన అందాలను మామూలుగా ఆరబోయలేదు అనుకోండి. బ్యాంకాక్ క్రాబి ఐల్యాండ్ బీచ్ లో తీసిన ఈ పాటలో.. అమ్మడు తన ఒంపుసొంపులను వెండితెరకు దారాదత్తం చేసిందంతే. గ్లామర్లందు రకుల్ గ్లామర్ వేరయా అనేంత తరహాలో రెచ్చిపోయింది.

సినిమా అంతా పి.ఎస్.వినోద్ తీసినా.. ఈ పాటను మాత్రం దబాంగ్ అండ్ ఏక్ థ టైగర్ వంటి సినిమాల సినిమాటోగ్రాఫర్ అశీమ్ మిష్రా తెరకెక్కించాడు. వామ్మో.. రకుల్ అందాలను పీక్స్ కు తీసుకుపోయాడంతే. ఆల్రెడీ బ్రూస్ లీ సినిమాలో 'లే ఛలో' పాటతో ఇదే తరహా ట్రీట్ ఇచ్చిన రకుల్.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మరో మైండ్ బ్లోయింగ్ కిక్ ఇవ్వనుందనమాట.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News