పారి అలియాస్ పరిణీతి చోప్రా కెరీర్ మ్యాటర్ తెలిసినదే. పరిణీతి ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసినదే. దీంతో పాటు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. `ది గర్ల్ ఆన్ ది ట్రైన్` దర్శకుడి తాజా చిత్రంలో రహస్య ఏజెంట్ పాత్రను పోషిస్తోంది.
రిభూ దాస్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం కథాంశం ఆసక్తికరం. చోప్రా నేతృత్వంలోని భారతీయ ఏజెంట్ల రహస్య రెస్క్యూ ఆపరేషన్ చుట్టూ తిరుగుతుంది.
``ఇది భారతదేశం-పాకిస్తాన్ నేపథ్యం కాదు. ఈ చిత్రంలో పరిణీతిని ఒక రహస్య ఏజెంట్ మాత్రమే. ఆపరేషన్ కు నాయకత్వం వహించే డేరింగ్ గాళ్ గా కనిపిస్తుంది. ఈ చిత్రం ఆమె వ్యక్తిగత ప్రయాణం పగ నేపథ్యంలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి`` అని చిత్ర బృందానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులో రజిత్ కపూర్ - కే కే మీనన్ - దిబియేండు భట్టాచార్య -హార్డీ సంధు తదితరులు నటిస్తున్నారు.
మార్చిలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్న ఈ ప్రాజెక్టును రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి నడుమ లొకేషన్లు వెతికి షూట్ చేయడానికి అనుమతులు పొందే పనిలో ఉన్నారు.
2016 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ది గర్ల్ ఆన్ ది ట్రైన్ హిందీ రీమేక్ విడుదల కోసం పరిణీతి ఎదురు చూస్తున్నారు. ఎమిలీ బ్లంట్ నటించిన పౌలా హాకిన్స్ నవల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. హిందీ వెర్షన్ యుకే నేపథ్యంలో తెరకెక్కగా పరిణీతితో పాటు అదితి రావు హైదరి- కీర్తి కుల్హారీ -అవినాష్ తివారీ కూడా ఇందులో నటించారు. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఈ ఏడాది మే 8 న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. మహమ్మారి నేపథ్యంలో విడుదల ఆలస్యం అయింది. సైనా నెహ్వాల్ బయోపిక్ లో పరిణీతి నామమాత్రపు పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అమోల్ గుప్తే తెరకెక్కిస్తున్నారు. టి-సిరీస్ భూషణ్ కుమార్ దీనిని నిర్మించనున్నారు.