టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం మరో వారం రోజుల్లో విడుదల కానుంది. మే 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. ఇది రిలీజ్ అయిన తర్వాత 2 వారాల పాటు ప్రమోషన్స్ కు కేటాయించి.. ఆ వెంటనే తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. తన తర్వాతి సినిమాను ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ తో చేయనున్న విషయం ఇప్పటికే తెలిసిందే.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ మార్కెట్ పెంచుకునేందుకు వీలుగా మురుగదాస్ తో ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నాడు మహేష్. తెలుగులో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా.. బాలీవుడ్ భామ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట యంగ్ బ్యూటీ ఆలియా భట్ ను తీసుకుంటున్నారని అన్నారు కానీ.. ఇప్పుడు మహేష్ పక్కన నటించేందుకు పరిణీతి చోప్రా ఒప్పుకుందని తెలుస్తోంది.
ఇప్పటికే కాంట్రాక్ట్ సైన్ చేయడం కూడా పూర్తయిందని.. ఈ సమయంలో ఆమె చూపించిన ప్రొఫెషనలిజం చూసి, యూనిట్ కి మైండ్ బ్లాంక్ అయిందని అంటున్నారు. 'సహజంగా సౌత్ సినీ నిర్మాతలు కాంట్రాక్ట్ చేసుకుంటారు కానీ అందులో ఇతర టాపిక్స్ ఉండవు. ఇలాగే ఓ కాంట్రాక్ట్ పంపిస్తే.. అందులో 20 రోజుల టైం ప్రమోషన్ కి కేటాయిస్తా అనే కాలమ్ ని యాడ్ చేసి మరీ.. పరిణీతి సైన్ చేసింది' అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మహేష్ బాబుతో పరిణీతి చోప్రా టాలీవుడ్ అరంగేట్రం ఖాయమైనట్లే.