చూపించి చూపించ‌న‌ట్టు ఏంటో ఈ పారీ..!

Update: 2021-07-03 10:30 GMT
చూపించిన‌ట్టే చూపించి..చూపించిన‌ట్టే చూపించి.. ఏంటో ఈ పారీ అలా క‌న్ ఫ్యూజ్ చేస్తోంది. గ‌త కొంత‌కాలంగా డ‌బూ ర‌త్నానీ క్యాలెండ‌ర్ 2021 సంద‌డి వెబ్ ని అట్టుడికిస్తోంది. ఇండ‌స్ట్రీ బెస్ట్ క‌థానాయిక‌ల ఫోటోగ్రాఫ్ లు అంత‌ర్జాలంలో కి దూసుకెళ్లాయి.

క్యాలెండర్ 2021 కొంచెం లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా దుమారం రేపుతోంది ఈ క్యాలెండ‌ర్. బాలీవుడ్ తారలు ఆలియాభ‌ట్- సన్నీ లియోన్- విక్కీ కౌషల్- అభిషేక్ బచ్చన్ - విద్యా బాలన్ ఈ సంవత్సరం డబ్బూ క్యాలెండర్ లో కనిపించిన బి-టౌన్ ప్రముఖులు. తారా సుతారియా- విజయ్ దేవరకొండ తొలిసారిగా డ‌బూ క్యాలెండ‌ర్ లోకి అడుగుపెట్టారు. ఆ ఇద్ద‌రి హాటెస్ట్ లుక్ ల‌ను ఆవిష్క‌రించ‌గా అభిమానుల్లో వైర‌ల్ గా దూసుకెళ్లాయి. రీసెంట్ గానే హృతిక్ రోష‌న్ గ్రీక్ గాడ్ ని త‌ల‌పించే ఫోజ్ వైర‌ల్ అయ్యింది.

ఇప్పుడు పారీ అలియాస్ ప‌రిణీతి చోప్రా ఎక్స్ క్లూజివ్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని జెట్ స్పీడ్ తో చుట్టేస్తోంది. డ‌బూ ఎప్ప‌టిలానే త‌న‌దైన ప్ర‌త్యేక లెన్స్ తో ఈ ఫోటోషూట్ చేశార‌ని చెప్పాలి. పారీ అలా నైట్ వేర్ లో క‌నిపిస్తోంది. అలా టాప్ లేపేస్తూ న‌డుము అందంతో పాటు ఇంకా ఏదో చూపించేయాల‌నే తాప‌త్రాయ ప‌డుతోంది. మొత్తానికి త‌న ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ట్రీట్ నే ప్లాన్ చేసిందిలా.

ప‌రిణీతి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ఫ్లాప్ లు వెంటాడినా అప్పుడ‌ప్పుడు ఛ‌మ‌క్కుల‌తో మెరిపిస్తోంది. ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. `ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్` చిత్రంలో త‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. అలాగే `సందీప్ P ర్ పింకీ ఫరార్` చిత్రంలో న‌ట‌న‌కు మంచి సమీక్షలను అందుకుంది. మునుముందు సైనా నెహ్వాల్ బ‌యోపిక్ తో ఎలాంటి మెరుపులు మెరిపించ‌నుందో వేచి చూడాలి.
Tags:    

Similar News